Begin typing your search above and press return to search.

'సీటీమార్'తో ఆట కాదు .. వేట మొదలవుతుంది: కోన వెంకట్

By:  Tupaki Desk   |   9 Sep 2021 4:30 AM GMT
సీటీమార్తో ఆట కాదు .. వేట మొదలవుతుంది: కోన వెంకట్
X
గోపీచంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది 'సీటీమార్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా తమన్నా అలరించనుండగా, కీలకమైన పాత్రలో భూమిక కనిపించనుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, 'వినాయకచవితి' కానుకగా ఈ నెల 10వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకుడు బోయపాటి .. మారుతి .. కోన వెంకట్ ... ప్రశాంత్ వర్మ .. లింగుసామి .. హాజరయ్యారు.

ఈ వేదికపై కోన వెంకట్ మాట్లాడుతూ .. "నేను ఈ ఫంక్షన్ కి రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి సెంటిమెంట్ .. రెండోది ఫ్రెండ్షిప్ .. మూడోది హోప్. సెంటిమెంట్ ఏంటో చెబుతాను .. నేను గోపీచంద్ గారి ఏ ఈవెంట్ కి వెళ్లినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. విజయవాడలో జరిగిన 'లౌక్యం' సినిమా ఈవెంట్ అందుకు నిదర్శనం. గోపీగారిలో హానెస్టీ ఉంటుంది. ఆయన ఒక డైలాగ్ చెప్పినా హానెస్టుగా చెబుతారు. ఫైట్స్ లో హానెస్టుగా కొడతారు. అదే విధంగా హానెస్టుగా డాన్స్ చేస్తారు. సార్ .. మీ హానెస్టీనే మిమల్ని ఇంతటి స్టార్ ను చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను.

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది .. 'కటౌట్ చూస్తే నమ్మేయాలి డూడ్' అని. అది మీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది. మీ కటౌట్ చూస్తే ఇతను హీరో కావడం కోసమే పుట్టాడ్రా బాబూ అనిపిస్తుంది. అలా ఒక సెంటిమెంట్ తో నేను ఈ రోజున ఈ ఫంక్షన్ కి వచ్చాను. ఇక రెండవది ఫ్రెండ్షిప్ .. ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ నాకు మంచి స్నేహితుడు. మా సినిమా 'గల్లీరౌడీ'ని ఈ నెల 3న రిలీజ్ చేద్దామని అనుకుంటే, 'సీటీమార్' ఆ రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. గోపీచంద్ గారి సినిమానే ముందురావాలి .. ఆ సినిమా వస్తేనే గేట్లు బద్దలు కొట్టుకుని లోపలి వెళతారు. అందువలన 'సీటీమార్'నే రంగంలోకి దింపమని చెప్పాను.

ఆ తరువాత 'గల్లీ రౌడీ'తో 10వ తేదీన వద్దామనుకుంటే, 'సార్ మేము అదే రోజున వద్దామని అనుకుంటున్నాము' అని శ్రీనివాస్ చెప్పాడు. ఆయన కోసం మళ్లీ డేట్ మార్చుకున్నాము. 'సీటీమార్'లో ఒక డైలాగ్ ఉంది .. 'ఇది ఆట కాదు వేట' అని. ఆ వేట 10వ తేదీ నుంచి మొదలుకావాలి .. నేను చెప్పిన హోప్ ఇదే. పాండమిక్ తరువాత అన్ని చోట్ల జనం విపరీతంగా కనిపిస్తున్నారు. థియేటర్లకు రావడానికి మాత్రం జంకుతున్నారు. 'సీటీమార్' దానిని బ్రేక్ చేస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా తరువాత రానున్న మిగతా సినిమాలకు ఊతాన్ని .. ఊపును ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.