Begin typing your search above and press return to search.

పీఆర్‌లో ఆరితేరిపోయిన కోన..

By:  Tupaki Desk   |   12 Jun 2015 9:30 AM GMT
పీఆర్‌లో ఆరితేరిపోయిన కోన..
X
కోన అంటే పేరు కాదు.. అదో బ్రాండ్‌! ఈ మాట ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. చివరికి శ్రీను వైట్ల సైతం ఒప్పుకున్నాడు. అతడు లేకుండా ఒక్క సినిమాకు మించి తీయలేకపోయాడు. కోన ఉండాల్సిందే అని హీరోగారే పట్టుబడితే వైట్ల మాత్రం ఏం చేయగలడు చెప్పండి. కోన హ్యాండ్‌ పడితే చాలు.. ఆ సినిమా కచ్చితంగా హిట్టే అనే నమ్మకం గట్టిగానే ఉంది సినీ జనాల్లో. కోన కూడా అలాంటి సినిమాలిచ్చాడు మరి. ఐతే ఇంతకుముందు సైలెంటుగా తన పని తాను చేసుకుపోయేవాడు కానీ.. ఈ మధ్య మాత్రం మనోడికి ప్రచార యావ బాగా ఎక్కువైనట్లుందన్నది ఇండస్ట్రీ జనాల మాట.

తన హ్యాండ్‌ పడే సినిమాల గురించి ఆ రేంజిలో ప్రచారం చేస్తున్నాడు మరి. తన పెన్ను పడితే అది బ్లాక్‌బస్టరే అంటుంటాడు కోన. మొన్న 'పండగ చేస్కో' ఆడియో ఫంక్షన్లోనూ అదే అన్నాడు. కానీ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చింది. కోన అప్పుడు అలా అన్నాడే అన్న ప్రశ్నలు వస్తాయి కదా.. అందుకే ట్విట్టర్లో కోన టీమ్‌ యాక్టివ్‌ అయిపోయింది. వీక్‌ డేస్‌లో కూడా విశాఖపట్నంలో 15 థియేటర్లలోనూ మార్నింగ్‌ షోస్‌ ఫుల్‌ అంటూ కోన ఓ ట్వీట్‌ చేస్తే.. ఎక్కడో బెంగళూరు నుంచి ఓ అభిమాని.. మల్టీప్లెక్స్‌కు వెళ్తే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టేశారంటూ బాధ పడటం.. ఈయన రీట్వీట్‌ చేయడం.. తర్వాత ఇంకెక్కడో హౌస్‌ఫుల్‌ అంటూ ఎవరో చేసిన రీట్వీట్‌ చేయడం.. ఇలా సాగుతోంది వరస. పండగ చేస్కో బ్లాక్‌బస్టర్‌ అని జనాలతో చెప్పించే వరకు ఆగేట్లు లేదు పరిస్థితి. ఫస్ట్‌ వీకెండ్‌లో హౌస్‌ఫుల్స్‌ అంటే నమ్ముతారు కానీ.. రెండో వారం వీక్‌ డేస్‌లో కూడా హౌస్‌ఫుల్‌ అంటూ డబ్బా కొడితేనే జనాలకు డౌటొచ్చేస్తోంది. కోన పీఆర్‌లో మరీ ఆరితేరిపోయినట్లున్నాడే అని!