Begin typing your search above and press return to search.
చిన్న నిర్మాతలకు కోన గాడ్ ఫాదర్
By: Tupaki Desk | 2 Nov 2015 1:30 PM GMTతోక లేని పిట్ట సినిమాతో పెద్ద ఫ్లాపు అందుకుని ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కోన వెంకట్. నిర్మాతగా అది మొదటి సినిమా అనుభవం. అయితే ఆ అనుభవాల నుంచే జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన అవకాశం వినియోగించుకుని సత్య సినిమాతో రైటర్ గా పాపులర్ అయ్యాడు. అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఇప్పుడు స్టార్ రైటర్ గా ఎదిగాడు. అయితే అక్కడితే అతడి ప్రస్థానం ఆగిపోలేదు. ఈ రైటర్ చెయ్యి పడితే సక్సెస్సే అన్న పేరు నుంచి ఇప్పుడు ఈయన ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమా హిట్టే అన్న స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం కోన వెంకట్ గోల్డెన్ లెగ్. కోటాను కోట్ల బిజినెస్ కి సెంటర్ పాయింట్. అతడి కనుసైగలతోనే కోట్లాది రూపాయల బిజినెస్ నల్లేరుమీద బండి నడకలా సాగిపోతోంది.
వాస్తవానికి కోన వెంకట్ రెండో సారి నిర్మాత అయ్యేవాడే కాదు. రాజ్ కిరణ్ గీతాంజలి స్ర్కిప్టు పట్టుకుని పివిపి సినిమాస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థను కలిశాడు. అక్కడ ఓకే అయిపోతోంది అనుకుంటుండగానే వర్ణ లాంటి డిజాస్టర్ రావడంతో ఆ సంస్థ ఈ చిత్రం తెరకెక్కించేందుకు వెనకాడింది. సరిగ్గా ఆ టైమ్‌లో ఆ స్ర్కిప్టు కోన చేతిలోకి వచ్చింది. ఈ సినిమాతో హిట్టు కొట్టొచ్చు. హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది కదా! అనుకున్న కోన వెంటనే ఆ సినిమాకి సమర్పకుడిగా మారారు. పెట్టుబడులు పెట్టారు. అప్పటికే కొన్ని బాలీవుడ్ సంస్థలతో పరిచయాలు, ప్రమోషన్ స్ర్టాటజీపై అవగాహన ఉన్న కోన గీతాంజలి చిత్రాన్ని సరైన దారిలో ప్రమోషన్ చేసుకుని ముందస్తు బిజినెస్ చేసుకున్నాడు. తర్వాత సినిమా పెద్ద సక్సెసైంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు మరోసారి సమర్పకుడిగా శంకరాభరణం చిత్రం తెరకెక్కిస్తున్నాడు. నిఖిల్ హీరోగా ఈ క్రైమ్ కామెడీ తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ట్రైలర్ తో హైప్ క్రియేటైంది. ఇప్పటికే 15కోట్ల బిజినెస్ జరిగింది. రిలీజ్‌కి ముందే కోన పెట్టిన పెట్టుబడులు సేఫ్. తన ఛరిష్మాతో బిజినెస్ లో హవా సాగిస్తున్నాడు కోన అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఒక రైటర్ ఇప్పుడు కోట్లాది రూపాయల ట్రేడింగ్ కి కేంద్రకం. చిన్న నిర్మాతలందరికీ అతడు దారి చూపించే దేవుడు. మునుముందు టాలీవుడ్‌ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నా ఆశ్చర్యం అక్కర్లేదు. ఇదో ఇన్ స్పయిరింగ్ స్టోరీ కదూ?