Begin typing your search above and press return to search.

పెళ్ళి తరువాత కలసి నటిస్తున్నారోచ్

By:  Tupaki Desk   |   10 Feb 2018 10:10 AM GMT
పెళ్ళి తరువాత కలసి నటిస్తున్నారోచ్
X
ఓ కాంబినేషన్ రిపీట్ అయితే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచొ ఆశపడుతున్నారు. నాగ చైతన్య - సమంత కలయికలో మరో సినిమా వస్తే బావుండని గత కొంత కాలంగా అక్కినేని ఫ్యాన్స్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. నాగ్ కూడా చాలా సార్లు తప్పకుండా ఉంటుందని స్పందించారు. ఆ మధ్య రెండు మూడు సినిమాలు వస్తున్నాయని కొన్ని రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా మారుతి - శైలజ రెడ్డి అల్లుడులో నటిస్తున్నారు అనే టాక్ వచ్చింది. కానీ ఏవి ఫైనల్ కాలేదు.

అయితే ఆ కోరిక మరికొన్ని రోజుల్లో నెరవేరబోతోంది. రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ వారిద్దరిని వెండితెరపై చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కోన వెంకట్ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్నుకోరి సినిమాకు డివివి. దానయ్య తో కలిసి సహా నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఎట్టకేలకు హిట్ అందుకున్నారు. అయితే రీసెంట్ గా అదే దర్శకుడితో మరొక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

నాగ చైతన్య - సమంత అందులో నటించనున్నారు. నిన్ను కోరి సినిమా తరువాత చైతు ఆ దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథకు ఒకే చెప్పేశాడు. ఇక హీరోయిన్ గా సమంత అయితే బావుంటుందని కోన వెంకట్ గారు ఆ కాంబినేషన్ ని ఎట్టకేలకు సెట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి త్వరలో సినిమాను స్టార్ట్ చేయాలనీ చేస్తున్నారు. ప్రస్తుతం చైతు సవ్యాసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు.