Begin typing your search above and press return to search.
అభినేత్రి కథ చెప్పేసిన కోన వెంకట్
By: Tupaki Desk | 4 Oct 2016 4:58 PM GMTవిడుదల ముందు వరకు స్టోరీ ఏమాత్రం రివీల్ చేయకుండా దాచి పెట్టి తెరమీద సర్ప్రైజ్ చేయడం ఓ పద్ధతి. ముందే కథ విప్పేసి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసి.. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా ఎంటర్టైన్ చేయడం మరో పద్ధతి. ‘అభినేత్రి’ సినిమా విషయంలో రెండో పద్ధతినే ఎంచుకున్నట్లున్నారు. ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే ఈ సినిమాపై ఓ అంచనాకు వచ్చేశారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్న కోన వెంకట్ కథ గురించి మరిన్ని వివరాలు చెప్పాడు.
‘‘అభినేత్రిలో హీరో పేరు కృష్ణ. అతను కోస్తా ప్రాంతంలోని ఓ మారుమూల పల్టెటూరి నుంచి వస్తాడు. వాళ్ల ఊరిలో అతనే అత్యధికంగా చదువుకున్నవాడు. అతను సిటీకొచ్చి ఉద్యోగం సంపాదించి స్థిరపడతాడు. అతడికి మోడర్న్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఇంగ్లిష్ మాట్లాడే అమ్మాయిని కోరుకుంటాడు. అలా అయితేనే తన పిల్లలకు కూడా ఇంగ్లిష్ వస్తుందని.. వాళ్లు కూడా మంచి స్థాయికి ఎదుగుతారని భావిస్తాడు. కానీ అతడి కోరికకు భిన్నంగా చదువు రాని ఓ పల్లెటూరి బైతుని పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. అతడికి ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండదు. మరి ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిపై అతడికి ప్రేమ ఎలా పుట్టింది. అతను ఆమెను ఎలా ప్రేమించడం మొదలుపెట్టాడు అన్నదే ఈ సినిమా కథ’’ అని వెల్లడించాడు కోన. తమన్నా ద్విపాత్రాభినయం సంగతేంటో సినిమా చూసి తెలుసుకోవాలని కోన చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/