Begin typing your search above and press return to search.
వెంకీ మామలో పంజాబీ మసాలా?
By: Tupaki Desk | 20 Nov 2018 7:15 AM GMTగురు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వరసబెట్టి యూత్ స్టార్స్ తో మల్టీ స్టారర్స్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ తొలిసారి తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించబోతున్న వెంకీ మామ(వర్కింగ్ టైటిల్)మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. పూజా కార్యక్రమాలు జరిగి చాలా రోజులే అయ్యింది. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. చైతు అందుబాటులో ఉన్నాడు కానీ ఎఫ్2 విడుదల తేదీ దగ్గరలో ఉండటంతో పాటు కాల్ షీట్స్ దానికే కేటాయించడంతో వెంకీ అది పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు చైతు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతాతో జట్టుకట్టి నటిస్తున్న మజిలీతో ఎంగేజ్ అయిపోయాడు.
సో వెంకీ మామ ఖచ్చితంగా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే సమాచారం పక్కాగా అందడానికి కొంత టైం అయితే పట్టొచ్చు. ఇక పోతే వెంకీ మామకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్ డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వెంకీమామకు రచయిత కం సహనిర్మాత కోన వెంకట్. దీని కథకు ఒక పంజాబీ సూపర్ హిట్ ఎంటర్ టైనర్ ని ఆధారంగా తీసుకున్నాడని ఇబ్బందులు లేకుండా హక్కులు కొనే చేస్తున్నారని దాని సారాంశం. కాకపోతే మరో నిర్మాత వెంకీ అన్నయ్య సురేష్ బాబు ఆమోదం కోసం ఇప్పటికీ దానికి చాలా రిపేర్లు జరిగాయట. అందుకే ఆలస్యం అవుతోందని అంటున్నారు.
పేరుకు పంజాబీ కథే అయినా తెలుగుకు సూట్ అయ్యే అంశాలు అందులో చాలా ఉన్నాయని ఇద్దరు హీరోలకు పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే అంశాలు ఉన్నందు వల్లే కోన ఏరికోరి దాన్ని తీసుకువచ్చాడని వినికిడి. ఇది నిజమనే నిర్ధారణ లేదు కానీ గతంలో కోన అడాప్ట్ చేసుకున్న కొన్ని కథలను బట్టి చూస్తే నిజమయ్యే అవకాశం లేకపోలేదు. క్యాచీ టైటిల్ తో ఇద్దరు హీరోల అభిమానులను ఆకట్టుకున్న వెంకీ మామలో పంజాబీ మసాలా ఉందొ లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే