Begin typing your search above and press return to search.
కోన వెంకట్.. ఇదే తొలి అనుభవం
By: Tupaki Desk | 19 Oct 2015 3:30 PM GMTకోన వెంకట్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ రైటర్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘ఢీ’ సినిమాతోనే రావాల్సిన గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత కోనకు వెనుదిరిగి చూసుకోవాల్సిన పనే లేకపోయింది. మనోడు చేయి పెడితే చాలు ఆ సినిమా హిట్టే అన్న పేరు వచ్చేసింది. అందుకు తగ్గట్లే విజయాలందుకున్నాడు కోన. ముఖ్యంగా శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఆ తర్వాత వచ్చిన రెడీ - కింగ్ - నమో వెంకటేశ - దూకుడు - బాద్ షా.. ఇలా ప్రతి సినిమా హిట్టే. మధ్య మధ్యలో షాడో - పాండవులు పాండవులు తుమ్మెద లాంటి ఒకటీ అరా ఫ్లాపులున్నాయి కానీ.. వాటిలో కోన హ్యాండ్ ఎక్కువగా ఏమీ లేదు.
ఐతే కోన హ్యాండ్ ఫుల్లుగా పడి కూడా సినిమా బోల్తా కొట్టడమన్నది గత పదేళ్లలో ఇప్పుడే జరిగింది. కోన కథ, మాటలు రెండూ అందించిన ‘బ్రూస్ లీ’ సినిమా బాక్సాఫీస్ భవిష్యత్ ఏంటో తేలిపోయింది. మామూలుగా చూస్తే ఈ సినిమాను ఏవరేజ్ అనొచ్చు కానీ.. దాని మీద పెట్టిన పెట్టుబడి, సాధిస్తున్న వసూళ్లు బేరీజు వేసుకుని చూస్తే డిజాస్టర్ కింద లెక్కగట్టాల్సిందే. ‘బ్రూస్ లీ’ విషయంలో అన్నీ తానై అన్నట్లు వ్యవహరించిన కోనకు ఇది కచ్చితంగా పెద్ద ఎదురు దెబ్బే. మొన్నామధ్య ‘పండగ చేస్కో’ సినిమాకే కోన లేక లేక ఓ ఫ్లాప్ ఖాతాలో వేసుకోబోతున్నాడని అంచనా వేశారు జనాలు. కానీ పరమ రొటీన్ అన్న విమర్శలు వినిపించినా కూడా ఆ సినిమా ఎలాగోలా పెట్టుబడి వసూలు చేసి బయటపడిపోయింది. కోనకు మచ్చ తీసుకురాలేదు. కానీ ‘బ్రూస్ లీ’ మాత్రం కోన కెరీర్ లో చెరగని మచ్చలా మిగిలిపోయేలా ఉంది.