Begin typing your search above and press return to search.
అసహనం అంటే.. కోనకి అసహనం
By: Tupaki Desk | 29 Nov 2015 9:20 AM GMTదేశం మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ అసహనం. అమీర్ ఖాన్ కామెంట్స్ తర్వాత ఇప్పుడిది పీక్స్ కి చేరిపోయింది. మరి ఆ అంశంపై ఏమంటారు అని కోన వెంకట్ అడిగితే.. "నా కామెంట్ ఎందుకు బాబూ.. అసలే నా సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నపుడు" అంటున్నాడు కోన వెంకట్.
దేశం, ఆ మాటకొస్తే ప్రపంచాన్నే ఆకర్షిస్తున్న అసహనంపై.. ఓ రైటర్ అయ్యుండి అలా మాట్లాడతారేంటి అంటే.. "ప్రతీ దానిపైనా ప్రతీ ఒక్కరికీ ఓ ఓపినీయన్ ఉంటుంది. అన్నీ బైటకు చెప్పేస్తామా.? కొంపలంటుకోవూ " అంటూ కౌంటర్ వేసేశాడు కోన. మరి అమీర్ ఖాన్ ని మీ గురువైన రామ్ గోపాల్ వర్మ విమర్శించాడు. పూరీ సమర్ధించాడు.. దాని సంగతేంటి అనే ప్రశ్నిస్తే.. ఇంకా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు కోన.
"వర్మ దేవుడినే విమర్శించాడు. ఆయనకు అమీర్ ఖాన్ ఓ లెక్కా ఏంటి. ఇక పూరీ జగన్నాథ్ సినిమా రిలీజ్ కి టైం ఉంది కాబట్టి.. ఆయన ఏదైనా మాట్లాడచ్చు. మరో నాల్రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకున్న నేను.. కాంట్రవర్సీల్లోకి దిగలేను కదా "అన్నాడు కోన. అంతా బాగానే చెప్పాడు కానీ. సమాజం మీద ఒపీనియన్ అడిగితే.. పర్సనల్ ఆబ్లిగేషన్స్ చెప్పడం ఏంటో ? ఏమైనా సొంత సంగతుల తర్వాతే కదా సమాజం... అందుకే కోన అలా చెప్పుంటాడు లెండి.