Begin typing your search above and press return to search.
కోన ఒక్కడే సాహసం సాగాలంటున్నాడు
By: Tupaki Desk | 26 May 2016 5:16 PM GMTసాహసం శ్వాసగా సాగిపో.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన మూవీ ఇది. కాంబినేషన్ క్రేజీగానే ఉన్నా.. రిలీజ్ విషయంలో ఆలస్యం జరగడంతో.. ఈ మూవీ గురించి ఎవరూ పట్టించుకోవడం మానేశారు. గతేడాది దీపావళికి ముందే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. ఇంకా ఆపసోపాలు పడుతూనే ఉంది.
తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించిన ఈ మూవీలో.. అక్కడ శింబు హీరోగా నటించాడు. శింబు వరుస వివాదాల కారణంగా షూటింగ్ లకు డుమ్మా కొట్టడంతో.. సాహసం ఎంతకీ సాగలేదు. ఈ మూవీకి సంబంధించి తన వర్క్ పూర్తి చేసేసిన చైతు.. అసలు పట్టించుకోవడం మానేశాడు. ప్రస్తుతం చేస్తున్న ప్రేమమ్ గురించి తప్ప.. అసలు ఈ చిత్రాన్ని ఏ మాత్రం కేర్ చేయడం లేదు నాగ చైతన్య. కానీ తెలుగు వెర్షన్ కి నిర్మాతల్లో ఒకడైన కోన వెంకట్ మాత్రం.. సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని వీలైనంత వరకూ, తన శాయశక్తులా ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.
రీసెంట్ టైమ్స్ లో కోనకు అన్ని ఎదురు దెబ్బలే తగలడం, శంకరాభరణంతో నిర్మాతగానూ నష్టాల పాలవడంతో.. ఈ సాహసంతో ఒడ్డున పడాలన్నది కోన ఐడియా. అందుకే తన ట్విట్టర్ పేజ్ ద్వారా.. చైతు మూవీని న్యూస్ లో ఉండేలా అప్ డేట్స్ ఇస్తున్నాడు. మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చాడు. దగ్గుబాటి రానా ఓ కేమియో చేయడం విశేషం.