Begin typing your search above and press return to search.
కోన.. వ్యక్తి కాదు శక్తి
By: Tupaki Desk | 31 Oct 2015 7:27 AM GMT‘బాద్ షా’ సినిమా తర్వాత శ్రీను వైట్ల నుంచి కోన వెంకట్ విడిపోయినపుడు కొందరు.. అయ్యో పాపం కోన ఏమైపోతాడో అనుకున్నారు. ఎందుకంటే అతను ఫేమస్ అయ్యిందే వైట్ల సినిమాలతో. కాబట్టి ఈ కటీఫ్ వల్ల కోనకే ఇబ్బంది అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. కోనతో వైరం వల్ల వైట్లనే ఇబ్బంది పడ్డాడు. కానీ కోన మాత్రం చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. వైట్ల నుంచి విడిపోయాక కోన ఇమేజ్ ఎంతో పెరిగింది. మరిన్ని విజయాలు అతడి ఖాతాలో పడ్డాయి. ఆ విజయాల క్రెడిట్ పూర్తిగా అతడికే దక్కింది.
వైట్ల మళ్లీ తనతో పని చేయక తప్పని పరిస్థితి కల్పించాడంటే కోన పవరేంటో అర్థం చేసుకోవచ్చు. ‘బ్రూస్ లీ’ ఫ్లాప్ అయినప్పటికీ కోన ఇమేజ్ కు పెద్దగా డ్యామేజీ ఏమీ కాలేదు. ఫ్లాప్ క్రెడిట్ మొత్తం వైట్లకే వెళ్లిపోయింది. కోన ఎంచక్కా తన తర్వాతి సినిమాల మీద దృష్టిపెట్టాడు. కోన భాగస్వామ్యం ఉన్న రెండు లో బడ్జెట్ సినిమాలు కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నాయి. అందులో ఒకటి.. శంకరాభరణం కాగా, ఇంకోటి త్రిపుర. ఈ రెండు సినిమాలు ఆడియోలు రెండు రోజుల వ్యవధిలో రిలీజయ్యాయి. ఈ ఫంక్షన్లలో కోన హంగామా మామూలుగా లేదు.
ఇండస్ట్రీలోని అతిరథ మహారథుల్ని ఈ ఫంక్షన్లకు పిలిచి చాలా పెద్ద ఎత్తున వేడుకలు చేశాడు. ముఖ్యంగా తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, అన్నీ తానై నడిపిస్తున్న ‘శంకరాభరణం’ విషయంలో అయితే హడావుడి మామూలుగా లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో టీజర్ - రానాతో ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేయించిన కోన.. ఆడియో ఫంక్షన్ కు చాలా పెద్ద పెద్ద వాళ్లనే రప్పించాడు. అల్లు అరవింద్ - వి.వి.వినాయక్ - శ్రీవాస్ - సమంత - బాబీ - గోపీచంద్ మలినేని - మారుతి లాంటి వాళ్లను ఆడియో ఫంక్షన్ కు అంగరంగ వైభవంగా వేడుక జరిపించాడు. అతిథులందరూ కూడా కోనను తెగ పొగిడేశారు. మొత్తానికి టాలీవుడ్ లో ఇప్పుడు కోన ఓ వ్యక్తి కాదు.. శక్తి అన్నట్లే ఉంది పరిస్థితి.