Begin typing your search above and press return to search.
వెంకీమామ లుక్కులో కానరాని కోన!
By: Tupaki Desk | 6 April 2019 10:22 AM GMTఒక సినిమా కథా చర్చలు జరిగే సమయం నుండి రిలీజ్ అయ్యేవరకూ సినిమా ఇండస్ట్రీలో దేనికీ గ్యారెంటీ ఉండదు. RRR లాంటి క్రేజీ ప్రాజెక్టుల లో డైసీ ఎడ్గర్ జోన్స్ ఒక హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించినా ఇప్పుడు అమె తప్పుకుంది. నాలుగు నెలల నుండి వర్మ ఎంతో పబ్లిసిటీ హంగామా చేసినా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ లో రిలీజ్ కాలేదు. ఎలెక్షన్స్ కు ముందే రిలీజ్ చేద్దామనుకున్న మంచు విష్ణు పెండింగ్ సినిమా 'ఓటర్' పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఎవరికీ తెలీదు. మహేష్ -సుకుమార్ ప్రాజెక్ట్ ఏమైందో అందరికీ తెలుసు..
ఇదే కోవలో 'వెంకీమామ' లో కోన పేరు కనపడడం లేదు. ఉగాది సందర్భంగా వెంకీమామ' ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో భూతద్దం పెట్టి వెతికి చూసినా కోన వెంకట్ పేరు లేదు. అలా అని ట్విట్టర్ లో ఏమైనా కోన గారు ఈ సినిమా గురించి స్పందించారా అంటే.. అదీ లేదు. 'వెంకీమామ' ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి సురేష్ ప్రొడక్షన్స్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. కోన ఫిలిం కార్పోరేషన్ లు సంయుక్తంగా నిర్మిస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. పైగా ఫిబ్రవరి 23 న కోన తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'వెంకీ మామ' గురించి వేసిన లాస్ట్ ట్వీట్ లో "మా వెంకీమామ మొదటి రోజు షూట్.. వెంకటేష్ & నాగ చైతన్య మిమల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు" అంటూ మూడు ప్రొడక్షన్ హౌసుల పేర్లు కూడా జోడించాడు. మరి ఇప్పుడేమైంది?
కోనకు ప్రియ శిష్యుడైన బాబీ సినిమా నుండి కోన తప్పుకున్నాడా.. లేదా కోన రచనలకు డైలాగులకు కాలం చెల్లిందని బాబీ అండ్ టీమ్ పక్కన పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. సురేష్ ప్రొడక్షన్స్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేర్లు మాత్రమే పోస్టర్ పైన ఉన్నాయి కాబట్టి కోన వెంకట్ కు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కూడా లేనట్టే. అసలే సక్సెస్ రేట్ తగ్గిపోయిన కోనకు ఇలాంటి ఇది మింగుడుపడని పరిణామం అనడంలో సందేహం లేదు!