Begin typing your search above and press return to search.
మళ్ళి వస్తున్న గీతాంజలి
By: Tupaki Desk | 11 March 2018 6:36 AM GMTటాలీవుడ్ లో సీక్వెల్స్ సక్సెస్ రేట్ తక్కువే అయినా మన దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మాత్రం మానుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, చిరంజీవి శంకర్ దాదా, రవితేజ కిక్ ఇలా ఎన్నో సార్లు స్టార్ హీరోలు చేసిన ప్రయోగాలు దాదాపు నెగటివ్ రిజల్ట్ ఇచ్చాయి. అందుకే వీటి జోలికి వెళ్ళే ముందు జాగ్రత్త అవసరం. కరెక్ట్ గా గురి చూసి కొడితే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని బాలీవుడ్ లో తీసిన ధూమ్, రేస్, హేరా ఫేరి లాంటివి బాక్స్ ఆఫీస్ సాక్షిగా ఋజువు చేసాయి. ఇప్పుడు గీతాంజలి కూడా సీక్వెల్ వరసలో ఉంది. కాకపోతే కొత్తది కాదు. నాలుగేళ్ల క్రితం అంజలి టైటిల్ రోల్ పోషించిన హారర్ కామెడీకి రంగం సిద్ధం అవుతోంది. ఈ జానర్ కు పాపులారిటీ రావడంలో ఈ సినిమా పాత్ర చాలా ఉంది.
దాదాపు అదే టీంతో నిర్మాత కోన వెంకట్ మరోసారి గీతాంజలితో భయపెట్టబోతున్నాడు. కాకపోతే దర్శకుడు మాత్రం మారుతున్నాడు. ఫస్ట్ పార్ట్ టేకప్ చేసిన రాజ్ కిరణ్ బదులు కొత్త దర్శకుడు సుబ్బును దీంతో పరిచయం చేయబోతున్నాడు కోన వెంకట్. రాజ్ కిరణ్ దాని తర్వాత చేసిన త్రిపుర, లక్కున్నోడు ఆశించిన విజయాలు సాధించలేదు. బహుశా తనను పరిగణనలోకి తీసుకోకపోవడానికి అదే కారణం కావొచ్చు. అంజలి, శ్రీనివాస రెడ్డి తదితరులంతా ఇందులో కూడా ఉంటారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోంది. మొదటి భాగం కంటే ఎక్కువగా భయపెట్టేలా దీన్ని రూపొందిస్తున్నట్టు టాక్.
ఈ గీతాంజలి సరి మణిరత్నం గీతాంజలి కూడా సీక్వెల్ వస్తే బాగుంటుంది కదా అని అభిమానుల కోరిక. అంత గొప్ప విజువల్ క్లాసిక్ ని మణిరత్నమే తీయలేడు అలాంటిది కొత్త తరం దర్శకులు అంతటి సాహసం చేయగలరా. అందుకే ప్రస్తుతానికి భయపెట్టే ఈ గీతాంజలితో సర్డుకోక తప్పదు.