Begin typing your search above and press return to search.

కోన గారు బురదలో రాయేశారెందుకో..?

By:  Tupaki Desk   |   3 May 2017 10:50 AM GMT
కోన గారు బురదలో రాయేశారెందుకో..?
X
బురదలో రాయేస్తే ఏమవుతుంది.. బురదొచ్చి మనకు అంటుకుంటుంది. బాలీవుడ్లో క్రిటిక్ అని పేరు చెప్పుకునే కమల్ ఆర్.ఖాన్ ను ఇలాంటి బురదగానే భావిస్తారు అక్కడి జనాలు. సెలబ్రెటీల్ని ఏదో ఒకటి అనడం.. వాళ్ల అభిమానులు స్పందిస్తే దాని ద్వారా పబ్లిసిటీ తెచ్చుకుని సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం.. ఇదీ అతగాడి వరస. ఈ మధ్య ఇతను మన సౌత్ తారల మీద పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ టైంలో ఎలా అవాకులు చెవాకులు పేలాడో గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య మోహన్ లాల్ ను ఉద్దేశించి కూడా అలాగే మాట్లాడాడు. వీళ్ల స్థాయికి ఈ కోన్ కిస్కా గొట్టం విమర్శించేదేంటి అని జనాలు లైట్ తీసుకుంటే బాగానే ఉండేది.

కానీ పవన్.. మోహన్ లాల్ ఫ్యాన్స్ ఊరుకోలేదు. అతడి మీద దాడికి దిగారు. పబ్లిసిటీ తెచ్చిపెట్టారు. ఇలాంటి వాళ్లను ఇగ్నోర్ చేయడమే సరైన దారి అని గుర్తించలేకపోతున్నారు జనాలు. తన వ్యాఖ్యల మీద సెలబ్రెటీలు.. అభిమానులు రెస్పాండై తనను ఎంత తిట్టిపోస్తే అంత మంచిదని భావించే రకం అతను. తాజాగా కమల్ ప్రభాస్.. రానాల గురించి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్లో వాళ్లిద్దరి కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ అని వ్యాఖ్యానిస్తూ.. వాళ్ల గురించి చెత్త వ్యాఖ్యానాలు చేశాడు. దీని మీద స్టార్ రైటర్ కోన వెంకట్ స్పందించాడు. కమల్ లాంటి వాళ్లు టెర్రరిస్టుల కన్నా వరస్ట్ అని.. అతడి స్టుపిడిటీలో రాజమౌళి.. ప్రభాస్.. రానా మన్నించాలని అన్నాడు. ఐతే కమల్ చేసిన వ్యాఖ్యల కంటే కోన చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు అతడికి మైలేజీ ఎక్కువగా వస్తుంది. మన జనాలు అతడిని తిట్టి.. పబ్లిసిటీ ఇస్తారు. అది అతడికి మంచే అవుతుంది. కాబట్టి స్థాయి లేని ఇలాంటి వాళ్లను ఇగ్నోర్ చేయడం మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/