Begin typing your search above and press return to search.

సైలెంట్ గా వస్తున్న కోన..!

By:  Tupaki Desk   |   24 Sept 2018 10:13 AM IST
సైలెంట్ గా వస్తున్న కోన..!
X
స్టార్ రైటర్ గా టాలీవుడ్ లో పీక్స్ ను చూసిన కోన వెంకట్ ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ లో పలు సినిమాలకు అయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. కొందరేమో అయన మనీ ఇన్వెస్ట్ చెయ్యడని.. ప్రాజెక్ట్ సెట్ చేసి అందులో భాగస్వామి అవుతాడని అంటుంటారు. ఇదంతా ఇలా ఉంటే కోన త్వరలో మెగాఫోన్ చేపట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడేంటి.. ఎప్పుడో అయన డైరెక్షన్ చేస్తాడని వార్తలు వచ్చాయి కదా? ఇప్పటికే కొన్ని సినిమాలకు పేరు వేసుకోకుండా ఆయనే డైరెక్ట్ చేసినట్టుగా కూడా గుసగుసలు కూడా ఉన్నాయి కదా అని మీరడిగితే దానికి సమాధనం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వాటిని పక్కనబెడదాం. తాజా సమాచారం ప్రకారం కోన ఒక సైలెంట్ సినిమా ను తెరకెక్కించే ప్రయత్నాలలో ఉన్నాడట. ఈ సినిమాలో మాధవన్ హీరో అని.. అనుష్క మరో కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. సైలెంట్ సినిమా అంటే ఒక ఎక్స్ పరిమెంట్ అని మనం అనుకోవచ్చు.

ఈ సినిమాకు డైరెక్టర్ హేమంత్ మధుకర్ కొ-డైరెక్టర్ గా పనిచేస్తాడట. ఈ సినిమాకు టైటిల్ 'సైలెంట్' అని అనుకుంటున్నారట. ఇక కోన సైలెంట్ గా సినిమా తీసి.. హిట్ కొట్టి.. వీలయితే కాసిన్ని అవార్డులు కూడా సాధించాలని మనం కూడా మనసులో సైలెంట్ గా కోరుకుందాం.