Begin typing your search above and press return to search.

ఇచ్చిపుచ్చుకోవ‌ల్సిందే అంటున్న కోన‌

By:  Tupaki Desk   |   9 Aug 2015 4:18 AM GMT
ఇచ్చిపుచ్చుకోవ‌ల్సిందే అంటున్న కోన‌
X
త‌మిళం నుంచి వ‌స్తున్న డ‌బ్బింగ్ సినిమా ల‌పై ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ చేసిన వ్యాఖ్య‌లు కాక పుట్టించాయి. ``ఎప్పుడైనా ఒక‌రికొక‌రు ఇచ్చిపుచ్చుకోవాలి. అక్కడి సినిమాల్ని మ‌నం ఆద‌రిస్తున్న‌ప్పుడు ఇక్క‌డ చిత్రాల్ని కూడా వాళ్లు ఆద‌రించాలి`` అని వ్యాఖ్యానించారు. స్టార్ రైట‌ర్‌ గా గుర్తింపు పొందిన కోన ఇన్నాళ్లూ డ‌బ్బింగ్ సినిమాల ఫంక్ష‌న్ల‌ కు హాజ‌ర‌య్యేవాడు కాదు. మ‌న సినిమాల‌కి అక్క‌డ ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు కాబ‌ట్టి... మ‌నం మాత్ర‌మే వాళ్ల‌ని ఎందుకు ఎంకరేజ్ చేయాల‌ని ఆయ‌న డ‌బ్బింగ్‌ సినిమాల‌కి దూరంగా ఉండేవార‌ట‌. సూర్య‌లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ సినిమాల‌కి సంబంధించిన వేడుక‌ల‌కి కూడా హాజ‌ర‌య్యేవాణ్ని కాద‌ని చెప్పుకొచ్చాడు. అయితే `బాహుబ‌లి`, `శ్రీమంతుడు` చిత్రాల‌కి త‌మిళంలో ఆద‌ర‌ణ ల‌భించిన త‌ర్వాత నా అభిప్రాయం మార్చుకొన్నా అని కోన తెలిపాడు. ఒట్టుతీసి గ‌ట్టున పెట్టి డ‌బ్బింగ్ సినిమా వేడుక‌కి హాజ‌ర‌య్యాన‌ని స్ప‌ష్టం చేశారు.

విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ చిత్రం `పాయుమ్ పులి` తెలుగులో `జ‌య‌సూర్య‌` పేరుతో విడుద‌ల‌వుతోంది. `సీమ‌శాస్త్రి`, `సీమ టపాకాయ్‌` సినిమాల ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెలుగులో `జ‌య‌సూర్య‌`ని విడుద‌ల చేస్తున్నాడు. ఆయ‌న‌తో ఉన్న ప‌రిచ‌యం దృష్ట్యా `జ‌య‌సూర్య‌` లోగో లాంచ్ వేడుక‌ కి కోన వెంక‌ట్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ``మ‌న సినిమాల్ని వాళ్లు చూడ‌న‌ప్పుడు మ‌నం మాత్రం ఆ డబ్బింగ్ సినిమాల్ని ఎందుకు మోయాలనే ఇన్నాళ్లూ వాటికి దూరంగా ఉన్నా. కానీ `బాహుబ‌లి`, `శ్రీమంతుడు` చిత్రాల‌కి త‌మిళంలోనూ ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. అందుకే ఇన్నాళ్లూ ఉన్న నా అభిప్రాయాన్ని మార్చుకొని ఈ వేడుక‌కి వ‌చ్చా. సినిమా ఘ‌న విజ‌యం సాధించాలి. నాగేశ్వ‌ర‌రెడ్డి స్ట్రెయిట్ సినిమాలు తీసే స్థాయికి ఎద‌గాలి`` అన్నారు. మా సినిమాల్ని చూస్తేనే మీ సినిమాల్ని చూస్తామ‌న్న‌ట్టు వార్నింగ్ ఇచ్చేసిన కోన సంగ‌తి తెలిస్తే త‌మిళ తంబీలు ఏమంటారో మ‌రి!!