Begin typing your search above and press return to search.
రిలయన్స్ తో కోన భారీ డీల్??
By: Tupaki Desk | 30 Nov 2015 11:30 AM GMTకోన వెంకట్ ఇప్పుడు కేవలం రైటర్ మాత్రమే కాదు. మూవీ జయాపజాయలను ముందే ఊహించగలిగే ఓ పవర్ అయిపోతున్నాడు. కోన బ్రాండ్ ఉంటే చాలు అన్నట్లుగా అనేక ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి.అయితే ఇప్పటివరకూ వచ్చినవన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు వచ్చిన ఆఫర్ మరో ఎత్తు అని చెప్పాలి.
కోన కి నిర్మాణ బాధ్యతలు కొత్తేం కాదు కానీ.. అంతకు మించి అన్నీ దగ్గరుండి చూసుకుని శంకరాభరణం తీశాడు. పనిలో పనిగా దర్శకత్వ పర్యవేక్షణ అనే కార్డ్ కూడా వేసేసుకున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి, టీజర్ - ట్రైలర్ - సాంగ్ ప్రోమోస్.. ఇలా అన్నీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కి రెడీ అయిన శంకరాభరణంకు.. 40 కోట్లు వసూలు చేసుకోగల సత్తా ఉన్న మూవీగా కోన చెబుతున్నాడు. ఈ ఒక్క డైలాగ్ తో కోన ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో అర్ధమవుతుంది. ఇప్పుడు కోనతో భాగస్వామ్యం కోసం.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ రిలయన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ డీల్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఎందుకంటే.. వచ్చే ఏడాది మూడు సినిమాలు సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలో కోన ఉన్నాడు. వీటితో పాటు శ్రీదేవి కోసం కూడా ఓ స్టోరీ అందిస్తున్నాడు.
ఇవి కాక రిలయన్స్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఈ డీల్ కోసం అయితే... కోన ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేకపోవడం అసలు హైలైట్. క్రియేటివిటీ పార్ట్ ని కోన హ్యాండిల్ చేస్తే.. ఫైనాన్షియల్ విషయాలు రిలయన్స్ వాళ్లు చూసుకుంటారు. ఈ సంస్థ నిర్మించే చిత్రాలన్నిటికీ కోననే డైరెక్షన్ చేయనుండడం అసలు హైలైట్. కాకపోతే.. స్టార్స్ తో మాత్రం చేయబోనని, అన్నీ చిన్న హీరోలతోనే చేస్తానంటూ చెప్పేశాడు కాబోయే డైరెక్టర్ కోన వెంకట్