Begin typing your search above and press return to search.
కోన సార్.. మరి ఆ కేసు సంగతేంటి?
By: Tupaki Desk | 6 April 2018 9:36 AM GMTసల్మాన్ ఖాన్ కు ఏమైనా అయితే చాలు.. బాలీవుడ్ జనాలు తల్లడిల్లిపోతారు. అప్పుడు వాళ్లకు చట్టాలు.. న్యాయ అన్యాయాలు ఏమీ గుర్తుకు రావు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా ప్రకటిస్తూ అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో బాలీవుడ్ జనాల బాధ మామూలుగా లేదు. ఐతే వాళ్లు మాత్రమేనా టాలీవుడ్ నుంచి సీనియర్ రైటర్ కోన వెంకట్ సైతం సల్మాన్ కు శిక్ష పడ్డ నేపథ్యంలో తన ఆవేదనను ట్విట్టర్లో వ్యక్తం చేశాడు. జంతువుల సంగతి తర్వాత ముందు మనుషుల్ని కాపాడాలి అంటూ ఆయన ట్వీట్ చేశాడు. తాను జంతువుల్ని వేటాడటానికి వ్యతిరేకమే అని.. కానీ అదే సమయంలో మనుషులు మరింత ముఖ్యమని.. సల్మాన్ విషయంలో తనకు చాలా ఆందోళనగా ఉందని అన్నాడు కోన.
ఐతే కృష్ణ జింకల కేసు సంగతి వదిలేద్దాం. సల్మాన్ తాగి కారు నడిపి ఒకరి మరణానికి.. ముగ్గురు తీవ్ర గాయాలు పాలు కావడానికి కారణమైన కేసు సంగతేంటి? అప్పుడు చనిపోయింది.. గాయపడింది మనుషులేగా? ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పిన పాపానికి ఒక పోలీసు జీవితమూ అన్యాయమైపోయింది. ఈ కేసు నీరుగారిపోయి ఉండొచ్చు. సల్మాన్ బెయిల్ మీద బయటికి వచ్చి దర్జాగా తిరిగేస్తుండొచ్చు. కోర్టు తీర్పుల గురించి వ్యాఖ్యానాలు చేయలేం సరే.. ఆ కేసులో సాక్ష్యాలన్నీ సల్మాన్ కు వ్యతిరేకుంగా ఉన్న మాట వాస్తవం కాదా? మరి ఆ కేసుకు సంబంధించి శిక్ష పడ్డపుడు కూడా ఈ జనాలు ఇలాగే స్పందించారు. సల్మాన్ కు ఏమన్నా అయితే జాతికే నష్టం అన్నట్లు మాట్లాడారు. సల్మాన్ జైలుకెళ్తే అన్ని వందల కోట్లు నష్టం.. ఇన్ని వందల కోట్లు నష్టం అని అన్నారు. అయినా చట్ట ప్రకారం ఏ నేరానికి ఎంత శిక్ష అనేది ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. ఆ తప్పుకు తగ్గ శిక్ష పడాల్సిందే. ఇప్పుడు జింకల్ని చంపితే ఐదేళ్లు శిక్షా అంటున్న వాళ్లు.. నాడు హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఐదుగురి జీవితాలు నాశనమయ్యాయి. వాళ్ల విషయంలో ఎవరైనా బాధ పడ్డారా? అయ్యో అన్నారా? ఇప్పుడు సల్మాన్ గురించి ఫీలవుతున్న కోన అయినా వాళ్ల గురించి స్పందించాడా?