Begin typing your search above and press return to search.
సైన్ చేసిన సినిమా స్క్రిప్ట్ నచ్చలేదట
By: Tupaki Desk | 20 March 2018 2:50 PM GMTఛలో సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఛలో విడుదల కు ముందే కణం అనే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేయడమే కాకుండా దర్శకుడు సాయి శ్రీరామ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు దర్శకనిర్మాతలకు ఈ యంగ్ హరోకి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారాయి.
దర్శకుడు సాయి శ్రీరామ్ తో చేయబోతున్న సినిమాని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. నివేద థామస్ మొదటిసారి ఈ సినిమాతో నాగ శౌర్యతో ఒకే తెరపైన మెరవబోతోంది. అన్ని బాగానే ఉన్నాయి కానీ స్క్రిప్ట్ లో చేసిన డెవలప్మెంట్ శౌర్య కి నచ్చలేదంట. ఈ విషయమై మాట్లాడుతూ, "శౌర్యకి స్క్రిప్ట్ నచ్చింది. నివేద థామస్ ఇందులో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. కానీ ఛలో సినిమా సక్సెస్ తర్వాత అతని వైఖరి మారింది. రెమ్యూనరేషన్ ఉన్నట్టుండి పెంచేశాడు. ఇప్పుడేమో స్క్రిప్ట్ నచ్చలేదు అంటున్నాడు. మరి ఆ విషయం ఛలో సినిమా విడుదల అవ్వకముందు గుర్తురాలేదా?" అంటూ ఫైర్ అయ్యారు కోన వెంకట్.
కానీ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ మాత్రం మరొక విధంగా చెప్తున్నారు. "అవును సినిమా చేయడానికి ఒప్పుకున్నాం. కానీ అప్పుడు మాకు పూర్తి స్క్రిప్ట్ ఇవ్వలేదు. ఇంకా డెవెలప్ అవ్వని కథను వినిపించారు. అదీ కాకుండా నవంబర్ లో మొదలు అవ్వాల్సిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ఇక్కడ శౌర్య మరే సినిమాలు ఒప్పుకోకుండా ఈ సినిమాకోసం గెడ్డం పెంచుతూ ఉంటే ఇటు కోన వెంకట్ సాయి శ్రీరామ్ ను వేరే ప్రాజెక్ట్ పని మీద రెండు నెలలు వైజాగ్ తీసుకెళ్లారు. మరి ఇది ఎంత వరకు న్యాయం" అంటూ మండిపడ్డారు శౌర్య తండ్రి.