Begin typing your search above and press return to search.

వ‌ర్మ 'కొండా' ట్రైల‌ర్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   26 Jan 2022 6:14 AM GMT
వ‌ర్మ కొండా ట్రైల‌ర్ వ‌చ్చేసింది
X
వివాదాల‌నే త‌న సినిమాల‌కు క‌థా వ‌స్తువులగా మార్చుకుంటూ వ‌రుస వివాదాస్ప‌ద చిత్రాల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు ద‌ర్శ‌కుడు రామ్ గోప‌నాల్ వ‌ర్మ‌. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం `కొండా`. తెలంగాణ‌కు చెందిన కొండా ముర‌ళి, కొండా సురేఖ‌ల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొన్ని రోజులుగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ని రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. అరుణ్ అదిత్, ఇర్రా మోర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వ‌ర్మ విడుద‌ల చేసిన ఓ వీడియో సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది. ర‌క్త చ‌రిత్ర త‌రువాత ఆ స్థాయిలో ఇంటెన్స్ వున్న క‌థ కావ‌డంతో ఈ సినిమా చుట్టూ గ‌త కొన్ని రోజులుగా వివాదాలు చెల‌రేగుతూనే వున్నాయి. అధికార పార్టీకి చెందిన వ‌రంగ‌ల్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రు ఈ సినిమాపై అభ్యంత‌రాలు చెప్పార‌ని, దీన్ని విడుద‌ల కానివ్వ‌కుండా అడ్డుత‌గులుతున్నార‌ని స్వ‌యంగా కొండా సురేఖ ఓ వీడియోని విడుద‌ల చేసి వారిని దూషించ‌డం ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారింది.

తాజాగా విడుద‌ల చేసిన ట్రైలర్ లోకి వెళితే.. వ‌ర్మ వాయిస్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న శ‌వాలు.. ఎన్ కౌంట‌ర్ లో చ‌నిపోయిన మావోయిస్టుల దేహాలు క‌నిపించాయి. `స‌మాజం గురించి నీతులు జెప్పుడు కాదు...బాగుజెయ్యాలే.. నీకు పోయేటందుకు ఏం లేవు.. బానిస సంకెళ్లు త‌ప్ప‌...విప్ల‌వ పోరాటాలు చ‌రిత్ర‌ను లాగే రైలింజ‌న్ లు.. పెత్తందారుల పెత్త‌నం భ‌రించ‌లేక కొంత మంది బ‌డుగు వ‌ర్గాలు తిర‌గ‌బ‌డి మొత్తం వ్య‌వ‌స్థ‌తోనే పోరాడుతున్న రోజుల‌వి. విప‌రీత ప‌రిస్థితుల నుంచే విప‌రీత వ్య‌క్తులు ఉద్భ‌విస్తార‌ని కార‌ల్ మార్క్స్ 180 సంవ‌త్స‌రాల క్రిలం చెప్పాడు. అలాంటి విప‌రీత ప‌రిస్థితుల మ‌ధ్య‌లో పుట్టిన వాడే కొండా ముర‌ళి.

`నా డెసిష‌న్‌ల‌కు నేనే బాధ్యున్ని కాబ‌ట్టి నా మాటే నేనింటా. అంటూ అరుణ్ ఆదిత్ చెబుతున్న డైలాగ్‌లు .. త‌ను గ్యాంగ్ స్టర్‌గా ఎదిగిన క్ర‌మాన్ని చూపించే విజువ‌ల్స్ ఎల్బీ కాలేజీలో కొండా ముర‌ళి, సురేఖ ల మ‌ధ్య మొద‌లైన ప్రేమ స‌న్నివేశాల‌ని, వారి మ‌ధ్య ప‌రిచ‌యం, ఆ త‌రువాత కొండా ఆర్కే తో కలిసి ఉద్య‌మంలోకి వెళ్లిన తీరుని, అదే బాట‌లో సురేఖ కూడా ఉద్య‌మం బాట ప‌ట్టిన స‌న్నివేశాల‌ని చూపించారు. రాజ‌కీయం అండ లేకుండా ఏది చేసినా రౌడీయిజ‌మే అంటార‌ని సురేఖ పాత్ర కొండాతో చెప్ప‌డం.. ట్రైల‌ర్ చివ‌ర్లో `నా పేరు కొండా ముర‌ళి` అంటూ అరుణ్ ఆదిత్ డైలాగ్ చెప్ప‌డం సినిమా ఏ స్థాయిలో ర‌క్త‌సిక్త స‌న్నివేశాల స‌మాహారంగా ప‌గ ప్ర‌తీకారాల నేప‌థ్యంలో తెర‌కెక్కిందో స్ప‌ష్టం చేస్తోంది.

`ర‌క్త చరిత్ర‌`ని త‌ల‌పించే క‌థ‌, క‌థ‌నాల‌తో అంత‌కు మించిన ప‌వ‌ర్ ఫుల్ స‌న్నివేశాల‌తో `కొండా` జీవిత క‌థ సాగిన‌ట్టుగా ట్రైల‌ర్ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు వ‌ర్మ‌. అయితే గ‌త చిత్రాల త‌ర‌హాలోనే వ‌ర్మ మార్కు టేకింగ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆయ‌న శిష్యుల్లో ఎవ‌రో ఒక‌రు సినిమాని పూర్తి చేసి వుంటార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఐడియా త‌న‌ది కాబ‌ట్టి వ‌ర్మ త‌న పేరు వేసుకుని ఇది త‌న చిత్రం అని చెబుతున్నారు.

కానీ వ‌ర్మ మార్కు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌థ ప‌రంగా `ర‌క్త‌ చ‌రిత్ర` త‌ర‌హాలోనే వున్నా.. క్వాలిటీ ప‌రంగా మాత్రం ఆ సినిమాకు ఎక్క‌డా స‌రితూగేలా క‌నిపించ‌డం లేదు. కానీ ఈ సినిమాతో వ‌ర్మ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించ‌డం కాయంగా క‌నిపిస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. యాపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ట్రైల‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.