Begin typing your search above and press return to search.
మాస్ లో `కొండపొలం` దూకుడెంత?
By: Tupaki Desk | 10 Oct 2021 10:30 AM GMTదర్శకుడు క్రిష్ తెరకెక్కించే సినిమాలకు తొలి నుంచి ఒక సెక్షన్ ఆడియెన్ కాస్త దూరమేననే విమర్శ ఉంది. క్లాసికల్ గా మూవీని తెరకెక్కించడంలో అతడు స్పెషలిస్ట్. కానీ మాస్ ని థియేటర్లకు రప్పించే నైపుణ్యంలో కొంత వెనకబడ్డాడని క్రిటిక్స్ లో విశ్లేషణలు ఉన్నాయి. ఈసారి కూడా అతడు వైష్ణవ్ తేజ్ కోసం ఎంపిక చేసుకున్న స్క్రిప్టు క్లాసీ నేరేషన్ తో ఉన్నదే. అది మల్టీప్లెక్స్ ఆడియెన్ ని క్లాస్ ని మెప్పించే చిత్రమని సమీక్షకులు విశ్లేషించారు.
ఇటీవల ఆడియెన్ మైండ్ సెట్ మారుతోందని ఆశించినా కానీ కొండపొలం కి అలాంటి ఊపు కనిపించలేదనేది ట్రేడ్ టాక్. కొండపోలం అనేది కొంత మంది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా. ఇప్పుడు ఈ చిత్రం నిన్న విడుదలైంది. మంచి సమీక్షలను పొందగలిగింది. కానీ అనేక ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ చాలా నీరసంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని బి- సి సెంటర్లలో వసూళ్లు నీరసంగా ఉన్నాయన్న టాక్ ఉంది. మాస్ జనం థియేటర్ల వైపు రాకపోవడం మైనస్ గా మారిందని టాక్. ఈ వారాంతంలో సినిమాకు మంచి కలెక్షన్లు రావాలి. లేకపోతే నిర్మాతలు కాస్త ఇబ్బంది పడతారు. ఈ చిత్రం సీరియస్ డ్రామా కావడంతో.. సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు. మునుముందు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో కాలమే తెలియజేస్తుంది.
అభిరుచితో తీసాడు కానీ..
కొండపొలం లాంటి ప్రయోగానికి మంచి సమీక్షలే వచ్చాయి. చక్కని సాహిత్యాభిరుచి ఉన్న దర్శకుడు క్రిష్.. రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన 'కొండపొలం' అనే పుస్తకాన్ని ఉన్నదున్నట్లుగా తెరపైకి తీసుకురావడానికి చేసారు. కథానుసారం.. కరవు కాలంలో గొర్రెలకు మేత.. నీళ్లు దొరకడం కష్టమైపోయినప్పుడు ఊరి వాళ్లు తమ గొర్రెల మందల్ని తీసుకుని అడవికి వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి మళ్లీ పరిస్థితులు బాగుపడ్డాక తిరిగి వచ్చే ప్రక్రియ సాగుతుంది. హీరో హీరోయిన్లను ఇలా గొర్రెలు మేపుకునేవాళ్లలా చూపించి.. ఈ కొండపొలం అనే కాన్సెప్ట్ మీద పూర్తిగా అడవి నేపథ్యంలో సినిమా తీయడం తెలుగులో పెద్ద సాహసమే. ఐతే కమర్షియల్ లెక్కలేసుకోకుండా మంచి కథల్ని చెప్పడానికే ప్రయత్నించే క్రిష్.. ధైర్యంగా ఈ సాహసం చేశాడు. కథలో ఉన్న బలానికి తోడు.. క్రిష్ కథన నైపుణ్యం కూడా తోడై.. 'కొండపొలం' ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ క్రిష్ తీసిన గమ్యం.. వేదం.. కంచె లాంటి చిత్రాల్లో మాదిరి ప్రేక్షకులను కదిలించే బలమైన ఎమోషన్ లేకపోవడం 'కొండపొలం'కు మైనస్ అయిందని విమర్శలొచ్చాయి. కొత్తగా అనిపించే కథాకథనాలు.. రెండు గంటలకు పైగా నిడివిలో బోర్ కొట్టించకుండా సాగిపోయే సన్నివేశాలు.. కథనంలోని వేగం కాలక్షేపానికి ఢోకా లేకుండా చేస్తాయి కానీ.. ఎమోషనల్ గా వెయ్యాల్సినంత ఇంపాక్ట్ మాత్రం 'కొండపొలం' వేయదన్న సమీక్ష లు వచ్చాయి. క్రిష్ తనవంతు ప్రయత్నం చేశారు. నటీనటులు చక్కని ప్రతిభను కనబరిచారు. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల లాంగిటివిటీ ఎలా ఉంటుంది అన్నదే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది.