Begin typing your search above and press return to search.
పీకూ రీమేక్ లో మెగా డాటర్
By: Tupaki Desk | 15 Sep 2015 4:08 AM GMTబాలీవుడ్ లో వరుసగా వినూత్న సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు షూజిత్ సర్కార్ మొన్ననే ''పీకూ'' సినిమాతో ఓ పెద్ద హిట్టే కొట్టాడు. ఈ సినిమాలో డయాలసిస్ పేషెంట్ గా అమితాబ్ బచ్చన్ - ఆయన కూతురిగా దీపికా పదుకోన్ లు అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని విక్టరీ వెంకటేష్ ఉవ్విళ్ళూరుతున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ వెంకీ కనుక యథావిథిగా అమితాబ్ పాత్ర చేసేస్తే.. కూతురు దీపికా పదుకోన్ పాత్రలో దాదాపు ఎటు చూసినా సమంత పేరే వినిపిస్తోంది. అయితే సమంత ఇప్పటికే ఒక స్టార్ హీరోయిన్.. పైగా వెంకీ పక్కన కూతురిలా అస్సలు కనిపించదేమో అనే అనుమానాలు ఉన్నాయ్. అందుకే ఒక కొత్తమ్మాయ్ అయితే బెటర్ అని అందరి అంచనా. కాని మరీ కొత్తమ్మాయ్ అంటే ప్రాజెక్టుకు హైప్ ఉండదు. సో, ఎలాగో తను కూడా హీరోయిన్ కావాలనే చూస్తుంది కాబట్టి, మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ఈ పాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అనే ఐడియా ఇప్పుడు చాలామంది సన్నిహితులకు వచ్చిందట.
బీభత్సమైన గ్లామరస్ పాత్రలతో శృతి హాసన్ రేంజ్ లో సందడి చేయడానికి బహుశా నిహారికకు కుదరకపోవచ్చు. అందుకు మెగా ఇమేజ్ అడ్డొచ్చే ఛాన్సుంది. అందుకే ఆమె ఆర్టు సినిమాలవైపే మొగ్గే ఛాన్సుంది. కాబట్టి పీకూ రీమేక్ లో వెంకటేష్ సరసన కూతురిగా చేస్తే అది పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అవుతుంది. మరి నిహారిక ఈ ప్రాజెక్టును దక్కించుకొని, ఆ పాత్రను సొంతం చేసుకొని, అందులో పరకాయ ప్రవేశం చేసి.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా తెరంగేట్రం చేస్తుందా అంటే.. అబ్బే అప్పుడే చెప్పలేం!!