Begin typing your search above and press return to search.
వేల కోట్ల అధిపతి.. డబ్బింగులేంటి?
By: Tupaki Desk | 16 Feb 2019 4:30 AM GMTయూనివర్శ్ మొత్తం ఒక డేటా సెంటర్ కి- సర్వర్లకు కనెక్టయ్యి ఉండాలన్నది టెక్నాలజీ సిద్ధాంతం. ఇదే సిద్ధాంతాన్ని వినోద పరిశ్రమకు అప్లయ్ చేస్తే.. యూనివర్శ్‌లో ఎవరు ఎక్కడ ఏం సంపాదించినా తిరిగి వినోదం వెతుక్కుంటూ సినీపరిశ్రమకు రావాల్సిందే. సినిమాలు తీయాల్సిందే. ఇదే సిద్ధాంతం యూనివర్శిటీలు నడిపించే డీన్ లు - ప్రొఫెసర్లు - ఛైర్మన్ లకు వర్తిస్తుంది. గ్లామర్ & గ్లిట్జ్ కి ఆకర్షితులు కానిదెవరు?
3.5 దశాబ్ధాల అసాధారణ చరిత్ర ఉన్న కెఎల్ యూనివర్శిటీ కర్తలు సైతం అందుకు అతీతులేం కాదని ప్రూవైంది. విజయవాడ కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ వరల్డ్ వైడ్ ఎంత పాపులరో తెలిసిందే. 1980లో మొదలైన ఫౌండేషన్ ఎడ్యుకేషన్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. ఇంతింతై అన్నచందంగా ది బెస్ట్ టెక్నాలజీ స్టూడెంట్స్ ని తయారు చేస్తున్న యూనివర్శిటీగా పాపులరైంది. కోనేరు లక్ష్మయ్య అనంతరం కోనేరు సత్యనారాయణ ఈ ప్రఖ్యాత యూనివర్శిటీకి ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ వర్శిటీకి అనుబంధంగా హైదరాబాద్ బాచుపల్లిలో 90 ఎకరాల్లో కెఎల్ యూనిర్శిటీ నిర్మాణం చేపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నానో టెక్నాలజీ స్పెషల్ కోర్సులు ఇందులో అందుబాటులోకి తెస్తున్నామని ఇదివరకూ కోనేరు సత్యనారాయణ కుమారుడు - కెఎల్ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు.. హీరో హవీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అల్లరి రవిబాబు దర్శకత్వంలో ఈనాడు రామోజీరావ్ నిర్మించిన `నువ్విలా` అనే చిత్రంతో హవీష్ హీరోగా పరిచయమైన సంగతి విధితమే. ఆ తర్వాత జీనియస్ వంటి చిత్రంలోనూ నటించారు. కానీ హీరోగా కెరీర్ ని టేకాఫ్ చేయడంలో తడబడ్డారు. ఓవైపు యూనివర్శిటీ ఉపాధ్యక్షుడిగా ఎంటర్ ప్రెన్యూర్ గా బిజీ బిజీ. మధ్యలో సినీరంగంపైనా ఆసక్తిగానే ఉన్నారు. హీరోగా సరైన సక్సెస్ లేక కొంతకాలంగా రంగుల ప్రపంచం నుంచి అతడు కాస్త దూరంగానే ఉన్నారు. కుమారుడు హవీష్ కోసం నిర్మాతగా మారిన కోనేరు సత్యనారాయణ ప్రస్తుతం సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇదివరకూ ఓ రెండు చిత్రాల్ని నిర్మిస్తున్నామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అరవింద స్వామి - శ్రీయ - సందీప్ కిషన్ తారాగణంగా నటించిన `నరకాసురుడు` అనే డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే అనువాద చిత్రమే అయినా అరవింద స్వామి అభిమానిగా ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారట. ఈ శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై అద్భుత స్పందన అందుకుంది. చరణ్ `ధ్రువ` చిత్రంలో క్లాస్ విలన్ గా నటించి మెప్పించిన అరవింద స్వామి `నవాబ్` చిత్రంతో మరోసారి మెప్పించారు. ప్రస్తుతం నరకాసురుడిగా అతడి నటనపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.