Begin typing your search above and press return to search.

30లోపే పెళ్ళంటున్న మెగా హీరొయిన్

By:  Tupaki Desk   |   23 March 2019 7:58 AM GMT
30లోపే పెళ్ళంటున్న మెగా హీరొయిన్
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరొయిన్ గానే తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మెగా డాటర్ నీహారిక మరోసారి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ లేదని ముప్పై వయసు లోపే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు కాబట్టి ఆలోపే వీలైనన్ని మంచి మూవీస్ తన కెరీర్ లో ఉండేలా చూసుకుంటున్నానని చెప్పింది.

ఈ కారణంగానే పెద్ద హీరోల ప్రాజెక్ట్స్ మీద ఆసక్తి లేదని ఒకవేళ ఉన్నా తనకున్న పరిమితులు వాళ్ళకూ తెలుసు కాబట్టి దర్శక నిర్మాతలు ఎవరూ అలాంటి ఆఫర్స్ తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చేసింది. తాను ప్రేమతో డాడీ అని పిలిచే పెదనాన్న చిరంజీవితో మాత్రమే నటించాలన్న కోరిక సైరాతో తీరిపోయింది కాబట్టి అంతకంటే పెద్ద టార్గెట్స్ ఏమి లేవంటోంది

మొత్తానికి నీహారిక చాలా క్లారిటీతో ఉంది. ఒకపక్క అన్నయ్య వరుణ్ తేజ్ వరస సక్సెస్ లతో జోరు మీదున్నాడు. మరో అన్నయ్య రామ్ చరణ్ ఇప్పటికే స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. ముగ్గురు బ్రదర్స్ ఉన్న మెగా ఫ్యామిలీలో చిరు కూతుళ్ళ తర్వాత జరగబోయే అమ్మాయి పెళ్లి నీహారికదే అవుతుంది. తన తర్వాత మళ్ళి పవన్ కూతురు తప్ప ఇంకే ఆడపిల్లలు లేరు.

సో పెళ్లి హడావిడి మాములుగా ఉండదు. నాగబాబు సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో నీహారికకు సంబంధాలు చూస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా సూర్యకాంతం విడుదల కోసం ఎదురు చూస్తున్న నీహారిక దీని తర్వాత చేయబోయే సినిమాలు త్వరలోనే ప్రకటిస్తాను అని చెబుతోంది