Begin typing your search above and press return to search.
గుక్కపెట్టి నిహారిక.. కారణం ఇదే..
By: Tupaki Desk | 23 July 2018 6:45 AM GMTమెగా డాటర్ నిహారిక నాన్న నాగబాబుకు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఎందుకు ఏడ్చింది.. కారణం ఏంటనేది వివరించింది. తండ్రికి ఫోన్ చేసి ఏడ్చానని చెప్పగానే అంతా కంగారుపడ్డారు. కానీ దాని వెనుకున్న కారణం తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు..
తాజాగా ‘హ్యాపీవెడ్డింగ్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నిహారిక - సుమంత్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ వేడుకలో నిహారిక చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తొలిరోజు సీన్ చేశాక నిహారిక ఏడ్చిన విషయాన్ని ప్రస్తావించింది.
నిహారిక మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మురళీ శర్మ - నరేష్ లాంటి గొప్ప నటులతో కలిసి సినిమా చేశారు. మురళీ శర్మగారితో మొదటిరోజు ఒక సీన్ చేశాను. సినిమాలో నాకు నాన్న క్యారెక్టర్ లో మురళీ శర్మ నటించారు. ఆయనతో ఆ సీన్ పూర్తికాగానే మా నాన్న నాగబాబుకు ఫోన్ చేసి గుక్కపెట్టి ఏడ్చాను. ఆ రోజు ఉదయమే నాన్న ఊరెళుతున్నారు.. సీన్ లో ఆయన గుర్తొచ్చి అలా ఏడుపు వచ్చింది. నాన్న నాగబాబు అంటే నాకు చాలా ఇష్టం.. ’ అని నిహారిక తన నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషన్ అయ్యింది.