Begin typing your search above and press return to search.

ఈగ విలన్.. ఎందుకు సెట్టవ్వలేదో??

By:  Tupaki Desk   |   10 Aug 2017 5:33 PM IST
ఈగ విలన్.. ఎందుకు సెట్టవ్వలేదో??
X
మెగాస్టార్ చిరంజీవి ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో తెలియదు కాని.. ఆ సినిమాకు సంబంధించిన ఊహాగానాలు మాత్రం నానాటికీ ఉదృతం అయిపోతున్నాయి. అయితే కొత్తగా వచ్చిన రూమర్ ఏంటంటే.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ను ఎప్రోచ్ అయిన తరువాత మనోళ్ళు సాండల్ వుడ్ సూపర్ స్టార్.. ఈగ్ సినిమాతో విలన్ గా తెలుగువారికి పరిచయమైన సుదీప్ ను కూడా ఒక రోల్ చేయమని అడిగారట. దీనిపై ఇప్పుడు రకరకాలు రూమర్లు వినిపిస్తున్నాయి.

సుదీప్ ను ఎప్రోచ్ అయ్యినట్లు ఆ మధ్యన ఒక నేషనల్ డైలీ తాలూకు బెంగుళూరు ఎడిషన్ కు సుదీప్ స్వయంగా చెప్పాడు. ఒక కన్నడ-తెలుగు మాట్లాడే వ్యక్తి రోల్ ఉంది కాబట్టి.. అందుకోసం ఖచ్చితంగా నా దగ్గరకే వస్తారని నాకు తెలుసు.. అంటూ సెలవిచ్చాడు సుదీప్. వెరైటీగా ఇప్పుడు సుదీప్ సైలెంటుగానే ఉన్నాడు కాని.. మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ మాత్రం ఈ వార్తలను కండించినట్లు తెలుస్తోంది. ఆయన కొణిదెల ప్రొడక్షన్స్ కు చెందినవారు.. అసలు ఈ సినిమా కోసం సుదీప్ ను అడగలేదని చెబుతున్నారట. అడగకుండానే సుదీప్ ఎందుకు అడిగినట్లు చెబుతున్నాడు? లేదంటే అసలు కొణిదెల ప్రొడక్షన్స్ ఈ విషయంలో ఏమి కామెంట్ చేయకుండానే ఇలాంటి రూమర్లు వచ్చాయా?

ఈ విషయంపై సస్పెన్స్ ను తొలిగించడం ఇప్పుడప్పుడే జరిగే పని కాదులే కాని.. అసలు ఈగ విలన్ ఉయ్యాలవాడలోని పాత్రకు ఎందుకు సెట్టవ్వలేదో తెలియాలంటే.. ఏదోక రోజు సుదీపే స్వయంగా చెప్పాల్సిందే. ఏది.. మొన్న.. బాహుబలి సినిమాలో శివగామి రోల్ చేయనందుకు శ్రీదేవి చెప్పుకుంది చూడండి ఒక ఎక్సప్లెనేషన్.. ఆ తరహాలో అనమాట.