Begin typing your search above and press return to search.

గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి కోడలు

By:  Tupaki Desk   |   1 March 2020 5:30 PM GMT
గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి కోడలు
X
ఆమె పెద్దింటికి కోడలు.. పెద్ద ఫ్యామిలీ నుంచే వచ్చింది.. కోట్లకు పడగలెత్తిన అమ్మింటి వారు ఒకవైపు.. టాలీవుడ్ లోనే నంబర్ 1 ఫ్యామిలీ అత్తింటివారు మరోవైపు ఆమెకు అండగా ఉన్నారు.. అంతటి కుబేరుల ఫ్యామిలీ కోడలు అయిన ఉపాసన మాత్రం తన మంచి మనసును మరోసారి చాటుకొని వార్తల్లో నిలిచారు.

చిరంజీవి కోడలు - రాంచరణ్ భార్య అయిన ఉపాసన సేవతత్పరత గురించి చాలా వార్తలు వచ్చాయి. ఎంతో మంది సాయం చేసిందని.. చేస్తుందని వివిధ విషయాలపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుందని పేరుంది. సాయం చేసే విషయంలో టాలీవుడ్ సెలెబ్రెటీలకు కూడా ఉపాసన రోల్ మోడల్ గా నిలుస్తోంది. తాజాగా మరో మంచి పనిచేసి ఆకట్టుకుంది.

తన ఇంట్లో చాలా కాలంగా వాడకుండా ఉన్న వస్తువులు, దుస్తులు మూటగట్టి వాటిని పేదలకు పంచడానికి రెడీ అయ్యింది. మనకు అవసరం లేని ఎన్నో వస్తువులు మన ఇంట్లో కొనేసి పక్కనపెడుతుంటాం. ఒకసారి వాడేసి మళ్లీ ముట్టుకోనివి ఎన్నో ఉంటాయి. ఉపాసన సైతం తమ ఇంట్లో వాడకుండా ఉన్న చాలా వస్తువులు, దస్తులను అన్నింటిని సేకరించింది. అవసరం ఉన్న వారందరికీ వాటిని పంచడానికి రెడీ అయ్యింది.

ఉపాసన ట్వీట్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. మెగా కోడలు మంచి పనికి ఫ్యాన్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి పనిచేశావ్ అంటూ కొనియాడుతున్నారు. మిగిలిన సెలెబ్రెటీలు కూడా ఉపాసన దారిలో నడవాలని అంటున్నారు.