Begin typing your search above and press return to search.

ఇదే నా క‌థ అంటూ ఆరోపిస్తున్నాడు.. నేనా క‌థ తీయడం లేదు!- కొర‌టాల‌

By:  Tupaki Desk   |   27 Aug 2020 2:00 PM GMT
ఇదే నా క‌థ అంటూ ఆరోపిస్తున్నాడు.. నేనా క‌థ తీయడం లేదు!- కొర‌టాల‌
X
ప్ర‌స్తుతం `ఆచార్య` కాపీ క‌థ అన్న టాపిక్ టాలీవుడ్ వ‌ర్గాల్లో హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌థ‌ను మైత్రి మూవీ మేక‌ర్స్ కి వినిపించాన‌ని రాజేష్ అనే ర‌చ‌యిత ఓ టీవీ చానెల్ లైవ్ సాక్షిగా ఆరోపించారు. మ‌ధ్య‌లో గొట్టిపాటి ర‌వికుమార్ అనే వ్య‌క్తికి ఈ విష‌యం తెలుసునని అయితే వీళ్లంద‌రికీ మీరు స్నేహితులు కాబ‌ట్టి దానిని స్ఫూర్తిగా తీసుకున్నార‌ని భావిస్తున్నాన‌ని అత‌డు చెప్పేందుకు ప్ర‌య‌త్నించాడు.

ఆచార్య నా నిజ జీవితంలో ఎదురైన ఓ సంఘ‌ట‌న స్ఫూర్తితో రాసుకున్న క‌థ‌. శ్రీ‌రామ న‌వ‌మి రోజున ఒక ఎండోమెంట్ అధికారితో నేను గొడ‌వ ప‌డ్డాను. అదే స్టోరీని రాసుకున్నా అని తెలిపాడు. ఇక ఇందులో తండ్రి సాధించ‌లేనిది కొడుకు సాధిస్తాడు అనే థీమ్ ఉంది. దేవాదాయ శాఖ అవినీతి.. దేవాల‌య భూముల్లో కుంభ‌కోణం నేప‌థ్యం ఉంద‌ని అత‌డు తెలిపాడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌గానే ఆ విష‌యం గ‌మ‌నించాన‌ని అత‌డు ఆరోపించారు.

అయితే కొర‌టాల మాత్రం దీనిని ఖండించే ప్ర‌య‌త్నం చేశారు. నాది ఎండోమెంట్ నేప‌థ్యంలోని క‌థాంశ‌మే. అయితే మీరు చెప్పే క‌థ నా క‌థ ఒక‌టి కానే కాదు. అస‌లు తండ్రి కొడుకు సెంటిమెంట్ నేప‌థ్యం కూడా నా సినిమాలో ఉండ‌ద‌ని కొర‌టాల అన్నారు. దేవుడి మాన్యాల‌పైన సినిమా ఇది. ఇదొక్క‌టే మీ క‌థ‌కు నా క‌థ‌కు పోలిక అని అన్నారు. అలాగే నా క‌థ‌ను కొట్టేశావ్ అని ఆరోపిస్తావా? అంటూ ర‌చ‌యిత‌పైనే కొర‌టాల ఫైర‌య్యారు. ఇదే క‌థ అంటూ ఆరోపించేస్తున్నారు. ఇలాంట‌ప్పుడు ఇంకేం చెప్పను అంటూ కొర‌టాల ఆవేద‌న చెంద‌డం లైవ్ లో షాకిచ్చింది. అస‌లు నేను ఆయ‌న చెప్పే క‌థ‌ను తీయ‌డ‌మే లేదు. మైత్రి వాళ్లు నాకు చెప్పే క‌థ కాద‌ని ఖండించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆయ‌న చెప్పిన క‌థ‌నే శివ కాపీ కొట్టి తీసేస్తున్నార‌ని ఆరోపించ‌డం స‌రికాద‌ని ఖండించారు. అయితే కోడైరెక్ట‌ర్ తో మాట్లాడాను.. నా క‌థ‌నే మీరు తీస్తున్నార‌ని రూఢీ చేసుకునే మాట్లాడుకుంటే బావుంటుంద‌ని సంప్ర‌దిస్తున్నాన‌ని రాజేష్ అన‌డం తో డిబేట్ హీట్ పెంచింది. వాదోప‌వాదాలు మాత్రం బ‌లంగానే ఉన్నాయి ప్ర‌స్తుతానికి...!