Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ నా క్లోజ్ ఫ్రెండ్
By: Tupaki Desk | 1 Aug 2015 5:40 PM GMTమిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కొరటాల శివ. ప్రస్తుతం మహేష్ కథానాయకుడిగా శ్రీమంతుడు చిత్రాన్ని తెరకెక్కించారు. తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే ఉంటుందని ప్రచారం అవుతోంది. ఇదే విషయాన్ని కొరటాలను అడిగితే కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎన్టీఆర్ వ్యక్తిగతంగా తెలుసు. నేను రచయితగా ఉన్నప్పట్నుంచి క్లోజ్ ఫ్రెండ్. తను నటించిన బృందావనం చిత్రానికి నేనే రచయితను. అప్పట్నుంచి మేం బాగా క్లోజ్. సినిమాలనే కాకుండా ఇతర విషయాలు మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా సరదాకి కలిసినప్పుడు సినిమాల గురించే కాక, పెట్టుబడుల గురించి, ఇతరత్రా విషయాలు చర్చించుకుంటాం.
ఇప్పుడిప్పుడే కొంచెం సంపాదించుకుంటున్నావ్. ఏమైనా కొన్నావా? అంటూ అడుగుతాడు. అంతటి సాన్నిహిత్యం మా మధ్య ఉంది. కచ్ఛితంగా ఓరోజు కలిసి సినిమా చేస్తాం. కానీ ఇప్పుడే ఫైనలైజ్ చేయలేను. ఎన్టీఆర్ తో సినిమా ఏదీ ఫైనల్ కాలేదింకా.. అని చెప్పారు. అంటే ఇప్పటికైతే ఎన్టీఆర్ తో సినిమా లేనట్టా? ఉన్నట్టా? అనేది శ్రీమంతుడు ఫలితం నిర్ణయిస్తుంది. ఎంతయినా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఏమైనా జరగడానికి ఆస్కారం ఉంది. వెయిట్ అండ్ సీ.