Begin typing your search above and press return to search.
ఇంకుడుకుంతకు కొరటాల ప్రచారం
By: Tupaki Desk | 24 Oct 2019 4:18 PM GMTసెలబ్రిటీలు మంచి చెబితే దానిని ఆచరించేందుకు జనం ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా బాధ్యతారాహిత్యంగా ఉండే సమాజానికి దిశా నిర్ధేశనం చేయాల్సిన బాధ్యత కూడా వైజ్ఞానికులు.. మేధో వర్గాలపై ఉంది. అవకాశం ఉండి సవ్యదిశలో సమాజాన్ని నడిపించేందుకు అంతో ఇంతో బాధ్యత తీసుకోకపోతే అంతకంటే మూర్ఖుడు ఉండడు.
సినిమావోళ్లు తెరపై నీతులు వల్లించడంలో ఘనాపాటీలు! అని వెటకారం ఆడేవారికి సరైన సమాధానం కూడా అవసరం. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చేసిన ఈ పని అన్నిటికీ సమాధానం అని పొగిడేయాల్సిందే. వేసవి వస్తే తాగునీటికి కిటకిటలాడే మెట్రో నగరాల్లో ప్రజలు ఎలా జీవించాలి. వర్షాకాలంలో భూమిపై పడే ప్రతి నీటిబొట్టును ఎలా ఒడిసి పట్టుకోవాలి? అన్నది చూపిస్తూ ఆయన రూపొందించిన ఈ వీడియో అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.
నగరంలో ఇప్పటికే ఇంకుడు గుంతలు నిర్మించి వాటర్ బోర్డ్ చాలా మేలైన పనులు చేస్తున్నా దానిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న అపప్రద ఉంది. వేలు.. లక్షలు పోసి ప్రభుత్వం ఇంటి పరిసరాల్లో ఇంకుడు కుంతలు నిర్మిస్తే వాటిని పేవ్ మెంట్ లానో పార్కింగ్ ప్లేస్ లానో వాడుతున్న ఘనాపాటీలు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కొందరి బాధ్యతారాహిత్యంపై నగర జలసంరక్షక మండలి ఇప్పటికే విసిగిపోయింది. అయితే అలాంటి ప్రబుద్ధుల కోసమేనా అన్నట్టు కొరటాల ఓ మంచి పని చేశారు.
హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఇంకుడుకుంతను సంరక్షిస్తూ.. నీటిని ఒడిసిపడుతున్న వీడియోని కొరటాల శివ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. నా కార్యాలయంలో పడిన ప్రతి వర్షపు బొట్టును సేవ్ చేస్తున్నాను.. అంటూ షేర్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మంచి మాటలు చెప్పడమే కాదు.. నిజంగా మీరు మంచి పనులే చేస్తున్నారంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.
మిర్చి-శ్రీమంతుడు-జనతా గ్యారేజ్- భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లకు దర్శకత్వం వహించిన కొరటాల శివ గొప్ప రచయిత.. సమాజానికి మేలు చేసే ఏదో ఒక అంశాన్ని తన సినిమాల్లో చూపించడం ఆయన ప్రత్యేకత. చూపించడమే కాదు ప్రాక్టికల్ గా రియాలిటీలోనూ చేసి చూపించి మనసు దోచారు. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవీ 152వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ పక్కాగా ప్రిపరేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇది సోషియో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. అంటే రాజకీయాలపై సెటైర్ తప్పనిసరి. సంఘంలో అరాచకాలు.. దుర్మార్గాలకు ఎదురెళ్లే ఒక పవర్ ఫుల్ మ్యాన్ ని ఇందులో చూపిస్తున్నారట.