Begin typing your search above and press return to search.

చిరు కోసం మారినా బన్నీ మూవీకి పాత పద్దతిలోనే కొరటాల

By:  Tupaki Desk   |   2 Sep 2020 10:50 AM GMT
చిరు కోసం మారినా బన్నీ మూవీకి పాత పద్దతిలోనే కొరటాల
X
మిర్చి సినిమాతో సినీ కెరీర్‌ ను ఆరంభించిన దర్శకుడు కొరటాల శివ మొదటి సినిమా నుండి దేవిశ్రీ ప్రసాద్‌ తో మాత్రమే వర్క్‌ చేస్తూ వచ్చాడు. మహేష్‌ బాబుతో చేసిన భరత్‌ అనే నేను వరకు దేవిశ్రీ ప్రసాద్‌ నే కంటిన్యూ చేస్తూ వచ్చిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న 'ఆచార్య' సినిమాకు గాను మణిశర్మతో కలిసి పని చేస్తున్నాడు. చిరంజీవి సూచన మేరకు ఈసారి మణిశర్మతో కొరటాల చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కొరటాల ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోకి ఆచార్య విభిన్నంగా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరోనా వల్ల ఆగిపోయిన 'ఆచార్య' త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆచార్య ఇంకా కనీసం సగం కూడా పూర్తి కాకుండానే అప్పుడే బన్నీతో కొత్త సినిమాను కొరటాల ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవలే అధికారిక ప్రకటన చేసిన కొరటాల శివ ఆ సమయంలో సంగీత దర్శకుడి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మొదట మణిశర్మతోనే మరో సినిమాకు కొరటాల వర్క్‌ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.

కాని ఆ సినిమాకు బన్నీ కోరిక మేరకు మళ్లీ దేవిశ్రీ ప్రసాద్‌ తో కూడా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలయ్యింది. ఆచార్య సినిమా ఫలితం ఆ సినిమా పాటలకు వచ్చే ఆధరణను బట్టి కొరటాల తుది నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు. కొరటాల శివ దేవిశ్రీ ప్రసాద్‌ జోడీ ఆచార్యకు తప్పినా మళ్లీ బన్నీ మూవీకి కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది.