Begin typing your search above and press return to search.
కొరటాల సినిమాల్లో.. హీరో నాన్ లోకల్ !!
By: Tupaki Desk | 15 April 2022 1:30 PM GMTకొరటాల సినిమాల్లో.. హీరో నాన్ లోకల్..యస్ మీరు విన్నది నిజమే.. ఈ స్టార్ డైరెక్టర్ చేసిన మొదటి సినిమా నుంచి తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. రైటర్ గా 'గాళ్ ఫ్రెండ్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ .. రవితేజ భద్ర, ప్రభాస్ మున్నా, గోపీచంద్ హీరోగా నటించిన 'ఒక్కడున్నాడు', ఎన్టీఆర్ నటించిన బృందావనం, ఊసరవెల్లి చిత్రాలకు మాటల రచయితగా పని చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా' చిత్రానికి కథ, మాటలు అందించారు. అయితే డబ్బులు ఇచ్చేశామని, దీనితో కొరటాలకు ఎలాంటి సంబంధం లేదని తనపేరే వేసేసుకుని షాకిచ్చారు.
ఆ తరువాత ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదన జరిగి వివాదం బయటికి రావడంతో 'సింహ' చిత్రానికి కథ, మాటలు రాసింది బోయపాటి శ్రీను కాదు కొరటాల శివ అని తెలిసింది. ఈ విషయం పక్కన పెడితే కొరటాల శివ 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. పల్నాడు కక్షల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఇందులో హీరో ప్రభాస్ సిటీ నుంచి వచ్చి తన తండ్రికి ఇబ్బందిగా మారిన ముఠాకు బుద్ది చెప్పాలని ప్రయత్నిస్తాడు. చివరికి పేరు మార్చుకుని విలన్ ఇంట్లోనే తిరుగుతూ అతని చుట్టూ వున్న వాళ్లలో మార్పుని తీసుకొస్తాడు. ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ లు చాలా పాపులర్ అయ్యాయి.
ఇక ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో చేసిన 'శ్రీమంతుడు' చిత్రం గురించి తెలిసిందే. 'ఊరు మనకు ఎన్నో ఇచ్చింది తిరిగివ్వకపోతే లావైపోతాం' అంటూ కొరటాల రాసిన డైలాగ్ లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే, శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోనూ హీరో సిటీ నుంచి పల్లెటూరికి రావడం, అక్కడున్న వారిని మార్చడం తెలిసిందే. ఈ మూవీతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి తొలిసారి అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ కంపనీగా మారిపోయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారి కలిసి నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మించింది. బలహీనుడిని బలవంతుడు ఆడుకోవడం ఆనవాయితీ కానీ బట్ ఏ ఛేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా బలముంది జనతా గ్యారేజ్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలోనూ హీరో ఎక్కడో బాంబే నుంచి హైదరాబాద్ కొస్తాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి జనతా గ్యారేజ్ ని మళ్లీ రీ ఓపెన్ చేస్తాడు. సేమ్ లైన్. సేమ్ క్యారెక్టర్.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అది వేరే విషయం అనుకోండి.
ఇక ఈ మూవీ తరువాత కొరటాల శివ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు తో చేసిన సినిమా 'భరత్ అనే నేను'. కుళ్లిన రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో బంధాలకు, నమ్మకాలకు విలువలేదని చెబుతూ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వుందో సూటిగా ప్రశ్నించిన చిత్రమిది. ఇందులో హీరో మహేష్ లండన్ నుంచి తండ్రి చనిపోయాడని తెలిసి ఇండియా వస్తాడు. ఇక్కడ జరుగుతున్న కుర్చీలాట తెలిసి ఇక్కడే వుండిపోతాడు. ఆ తరువాత వరదరాజులు తెరచాటు రాజకీయం బయటపడటంతో అతనికి అతనే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. దీంతో కథ సూఖాంతం అవుతెంది మహేష్ మళ్లీ సీఎం అవుతాడు. ..ఇలా ప్రతీ సినిమాలోనూ కొరటాల కథల్లో హీరో నాన్ లోకల్.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా 'ఆచార్య'కు కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయ్యారు. పాదఘట్టం.. ధర్మస్థలి కోసం పోరాడే వ్యక్తి సిద్ధాగా రామ్ చరణ్ ఇందులో నటిచాడు. 25 నిమిషాల పాటు మాత్రమే చరణ్ పాత్ర సాగుతుందట. అంటే విలన్ ల కారణంగా చరణ్ పాత్ర ఎండ్ అవుతుందన్నమాట. ఆ తరువాత పాదఘట్టంలోని ధర్మస్థలిని కాపాడేందుకు ఆచార్య గా మెగాస్టార్ చిరంజీవి వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తాడు. ఆ తరువాత ఏం చేశాడు? .. తనకు సిద్ధాకు వున్న అనుబంధం ఏంటీ? అన్నది అసలు కథ. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.
'మిర్చి' నుంచి ఆచార్య వరకు కొరటాల శివ ఇదే ఫార్ములాని పాటిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇది గమనించిన వారంతా ఓ ఫార్మాట్ చిత్రాలకు ఫిక్స్ అయిపోయిన కొరటాల దాని నుంచి ఇకనైనా బయటకు రావాలని, తను విభిన్న స్క్రిప్ట్‌లను ఎంచుకుని, ఓల్డ్ స్కూల్ స్టోరీ లైన్ ఫార్మాట్‌ను పక్కన పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.