Begin typing your search above and press return to search.
హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న కొరటాల!
By: Tupaki Desk | 28 April 2022 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'ఆచార్య' రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడంతో మెగా అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ మెంట్ పెరిగిపోతుంది. మరోవైపు సినిమాకి సంబంధించిన ప్రచారం పనులు అంతే వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి..రామ్ చరణ్ ..కొరటాల శివ అన్ని మీడియా సంస్థల్ని చుట్టేస్తున్నారు.
దీనిలో భాగంగా 'ఆచార్య'తో పాటు మరెన్నో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొరటాల డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పకనే చెప్పారు. స్వామివివేకా నంద జీవితంపై గాంధీ తరహా సినిమా చేయాలని ఉంది.
కానీ ఇప్పుడు కాదు. ఆయన కథపై ఎంతో రీసెర్స్ చేయాల్సి ఉంది. ఆయన కథని తెరకెక్కించాలని నమ్మకం..అనుభవం కలిగిన తర్వాత ఆ సినిమా జోలికి వెళ్తాను.
అప్పటివరకూ ఆ కథని టచ్ చేయను. ఎందుకంటే నేను తెలుసుకున్న గొప్ప వ్యక్తుల జీవితాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన బోధనలు.. సందేశాలు ప్రపంచానికి చేరాలంటే ఆయన జీవితంపై సినిమా తెరకెక్కాల్సిందే అనిపిస్తుంది. అదీ ఆషామాషీగా చేయకూడదు. హాలీవుడ్ వాళ్లు గాంధీ సినిమా తీసినట్లు పెద్ద స్థాయిలో తీయాలి.
నా ఆలోచన కూడా అదే. వివేకానందుడు జీవితం ప్రపంచానికి నావంతుగా చాటి చెప్పాలని ఉంది అని అన్నారు. అలాగే తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ఖరారు చేసారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన విషయాలు ప్రకటిస్తామన్నారు. పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది అన్నారు.
అలాగే 'ఆచార్య' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడమే కాకుండాల వాణిజ్య అంశాల్ని ఎట్టిపరిస్థుతుల్లో మిస్ చేయకూడదు అనుకున్నాను. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య సినిమా తీసాను. సినిమాపై చాలా నమ్మకం తో ఉన్నాను. ఇద్దరి స్టార్ హీరోలతో సినిమా చేయడం నిజంగా లైఫ్ లో మర్చిపోలేని మూవ్ మెంట్ అని అన్నారు.