Begin typing your search above and press return to search.

ఫస్ట్ ఓత్ రేపే..గెట్ రెడీ మహేష్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   25 Jan 2018 4:55 PM GMT
ఫస్ట్ ఓత్ రేపే..గెట్ రెడీ మహేష్ ఫ్యాన్స్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మోత్సవం - స్పైడర్ వంటి డిజాస్టర్ సినిమాల తరువాత ఏ మాత్రం అంచనాలు తగ్గకుండా భరత్ అనే నేను సినిమాతో మహేష్ రాబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తున్నా ఇంకా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

మహేష్ కూడా ఎక్కడా సినిమా గురించి చెప్పలేదు. ఆ మధ్యలో ఓ ఫొటో లీక్ అయితే కొరటాల సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనే సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ ని ప్రేక్షకులకు చూపించబోతున్నడు. అందరిలా కాకుండా సినిమా లోని ఒక పాట ని రిలీజ్ చేస్తున్నాడు. ఒక వీడియో ద్వారా కొరటాల ఈ విషయాన్ని తెలిపాడు. ఇంకా ఎం చెప్పారంటే.. ఆంద్రప్రదేశ్ బ్యాక్ గ్రౌండ్ రాజకీయాలను బేస్ చేసుకొని ఈ సినిమా ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి జనవరి 26న రిపబ్లిక్ డే బెస్ట్ అని టీమ్ అందరం నిర్ణయించుకున్నాం.

ఈ రిపబ్లిక్ డే మార్నింగ్ 7 గంటలకు ఫస్ట్ ఓత్ అనే పేరుతో ఒక ఆడియోను రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి కంటెంట్ కి ఒక వీడియో కంటే ఆడియోని రిలీజ్ చేస్తేనే మంచి ఇంపాక్ట్ ఉంటుందని అందరం బావించాం. అందుకే అన్ని ఆడియో ప్లాట్ ఫార్మ్స్ లో ఫస్ట్ ఓత్ రిలీజ్ కానుంది అంటూ కొరటాల తెలియజేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆ సాంగ్ ఎలా ఉంటుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. కొరటాలకి కృతజ్ఞతలు తెలిపారు.