Begin typing your search above and press return to search.
మెగా 152 డేట్ లాక్ చేశారా?
By: Tupaki Desk | 26 Jun 2019 6:07 AM GMTఇంకా సైరా విడుదల తేదీనే అధికారికంగా ప్రకటించలేదు అప్పుడే నెక్స్ట్ చేయబోయే కొరటాల శివ సినిమాకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరు కోసం గత ఏడాదికి పైగా వెయిటింగ్ లో ఉన్న శివ ఇప్పుడు సైరా నిర్మాణం పూర్తి కావడంతో ఎప్పుడెప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళదామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. రేపో మాపో హీరోయిన్లు ఫైనల్ అవుతారు.
ఇదిలా ఉండగా దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి 2020 ఉగాది కానుకగా ఇవ్వాలని చిరు చరణ్ లు చూచాయగా ఒక నిర్ణయానికి వచ్చారట. ఇది నిజంగా షాక్ ఇచ్చే విషయమే. అప్పటికి సైరా వచ్చి ఆరు నెలలే అయ్యుంటుంది. ఇంత తక్కువ గ్యాప్ లో చిరు రెండు సినిమాలు రావడం కన్నా ఫ్యాన్స్ కు కావాల్సింది ఏముంటుంది. అయితే ఇది ఎంత వేగంగా షూట్ పూర్తి చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇన్ సైడ్ ప్రకారం రిలీజ్ డేట్ ని మార్చ్ 25 ఫిక్స్ చేసుకుని మొదలుపెడతారట.
డెడ్ లైన్ ఉంటే వేగంగా పనులు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.అధికారిక ప్రకటన వచ్చే దాకా ఏదీ నమ్మలేం కానీ ఇచ్చిన టైంలో ఫినిష్ చేసే సామర్ధ్యం కొరటాల శివ దగ్గర ఉంది. భరత్ అనే నేనుకి సైతం ఇలాంటి ఒత్తిడి ఎదురైనప్పుడు తట్టుకుని మరీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయి. చిరు కో ఆపరేట్ చేస్తే అనుకున్న టైం కన్నా ముందే ఫినిష్ చేయొచ్చు. ఆరోగ్యం దృష్ట్యా చిరుతో మరీ దూకుడుగా చేయించడం భావ్యం కాదు కాబట్టి మార్చ్ 25 డేట్ ని అందుకోవడం అంత సులభం కాకపోవచ్చు