Begin typing your search above and press return to search.
ఆ ప్రశ్న చాలామంది అడిగారు-కొరటాల
By: Tupaki Desk | 29 Aug 2016 10:30 PM GMTతెలుగులో చాలామంది పెద్ద నటులున్నా.. వాళ్లందరినీ కాదని ‘జనతా గ్యారేజ్’ సినిమాకు మలయాళ నటుడు మోహన్ లాల్ ను ఎందుకు తీసుకున్నారని తనను చాలామంది అడిగారని కొరటాల శివ చెప్పాడు. ఐతే కొన్ని పాత్రలకు కొందరు నటులై సూటవుతారని.. మోహన్ లాల్ చేసిన పాత్ర కూడా అలాంటిదే అని.. ఆయనే ఆ పాత్రకు కరెక్ట్ అని కొరటాల అన్నాడు. ‘‘తెలుగు నటుల్ని కాదని మోహన్ లాల్ ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న చాలామంది నుంచి వచ్చింది., కానీ ఆ పాత్రకు ఆ స్థాయి నటుడైతేనే సరిపోతుందనిపించింది. ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని నేను భావించాను. తెరమీద కూడా వారి జోడీ అలాగే కనిపించింది. మోహన్ లాల్ గారు ఈ కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారు’’ అని కొరటాల చెప్పాడు.
‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత హిట్టవుతుందనే ఆలోచన కంటే.. ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి తనలో ఎక్కువ ఉందని కొరటాల చెప్పాడు. పరీక్ష రాసిన పిల్లాడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లే తన పరిస్థితి ఉందన్నాడు. ఎన్టీఆర్ ను ఇప్పటిదాకా ఎవరూ చూపించని విధంగా తాను చూపించాననే ధీమాతో ఉన్నట్లు కొరటాల చెప్పాడు. ‘‘ఈ కథ గురించిన ఆలోచన రాగానే దీనికి కేవలం ఎన్టీఆర్ మాత్రమే సరిపోతాడని అనుకున్నా. స్క్రిప్టు విన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుతో ఇక పూర్తిగా ఫిక్సయిపోయాను. ఒక నటుడు ఓ కథ విషయంలో ఎంతగా ఎగ్జైట్ అవుతాడన్నది దర్శకుడికి చాలా ముఖ్యం. నన్ను ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా ఎన్టీఆర్ కు చాలా బాగా తెలుసు. ప్రతి హీరోకూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఎన్టీఆర్ శైలిని ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో చూపించానని నమ్ముతున్నా’’ అని కొరటాల అన్నాడు.