Begin typing your search above and press return to search.
పంచ్‌లేవీ లేకుండా అకౌంట్లో వేసేశాడు
By: Tupaki Desk | 7 Aug 2015 12:50 PM GMTఒక రచయిత కం దర్శకుడు సినిమా తీశాడంటే ఆ సినిమాపై డిబేట్ తప్పనిసరి. ఈరోజు రిలీజైన శ్రీమంతుడు విషయంలోనూ అదే జరుగుతోంది. కొరటాల శివ బేసిక్ గా రచయిత కాబట్టి అతడు ఈ చిత్రంలో అదిరిపోయే పంచ్ లు రాసేసి ఉంటాడని అనుకున్నారు. కానీ అతడు ఎక్కడా ఒరగలేదు. నిండుకుండలా అర్థవంతమైన డెప్త్ ఉన్న డైలాగులు రాసి ఆకట్టుకున్నాడు. వాటిలో మచ్చుకు కొన్ని మచ్చు తునకలు పరిశీలిస్తే ఆయా సందర్భాల్లో అద్భుతంగా కుదిరాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా టీజర్ లో వదిలిన డైలాగ్ ఆ సన్నివేశంలో అద్భుతంగా కుదిరింది.
'ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లకు రంగులేసి వెళ్లిపోవడం కాదు.. వీడ్ని, వాడ్ని, వీళ్లందరినీ .. నిన్ను, నీవాళ్లందరినీ అందరినీ దత్తత తీసుకోవడమే' అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు ప్రిన్స్. ఈ సీన్ లో పౌరుషం, రోషం ఉన్న మగాడిని చూపించాడు. అంతేనా 'ఎవడేం చేసినా మన అకౌంట్లో పడుద్ది' అంటూ విలన్ వెనక ఉండే అసిస్టెంటు చేత బాగానే చెప్పించాడు. ఒకరు చేసిన మంచిని, ఒకరి గొప్పతనాన్ని తమ అకౌంట్లో వేసేసుకోవడానికి తాపత్రయ పడే పెద్దమనుషులు సంఘంలో బోలెడుమంది. అలాంటివాళ్లందరికీ ఎక్కడో తాకింది ఈ డైలాగ్.
'సాటి మనిషి కష్టం మనది కాకపోతే.. సంఘంలో మనం ఎందుకు? అంటూ గొప్ప సంస్కారాన్ని చాటాడు కొరటాల. నిజమే విలువలు, బంధాలు మరిచిపోయి, డబ్బు కోసం ఆడే ఆటలో అన్నిటినీ మర్చిపోయాం ఏనాడో. దాన్ని కెలికిపడేశాడు. 'రాత్రి వోల్వో బస్సు ఎక్కితే పొద్దున్నకు వెళ్లిపోతాం..' అంటూ కోస్తా గుండెని పిండేశాడు నిజంగా. ఆ డైలాగ్ హైదరాబాద్ నుంచి కృష్ణ, గుంటూరు, గోదారి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం నిత్యం ప్రయణించే కష్టజీవులందరినీ ఎక్కడో తాకుతుందనడంలో సందేహమే లేదు. పండగలకి, పబ్బాలకి ట్రావెల్స్ ఏజెంట్ల దోపిడీ సాక్షిగా ఈ డైలాగ్ సినిమాకే హైలైట్.
పట్నం వెళ్లి ఫ్యామిలీని సెటిల్ చేయాలన్న ఆలోచన బావుంది. కానీ అందుకోసం అన్నదమ్ముల్ని విడదీస్తున్నావ్. నీకిది భావ్యం కాదు... అంటూ విలువల్ని బాగా తరచి తరచి టచ్ చేసే ప్రయత్నం చేశాడు కొరటాల. అందుకే శ్రీమంతుడు హిట్టు అంటూ టాక్ వచ్చింది. మ్యాగ్జిమమ్ స్లోనేరేషన్ ఉన్న కథకి అండర్ కరెంట్ డెప్త్ తో రాసిన ఈ డైలాగులన్నీ పంచ్ ల కంటే బాగా పేలాయనడంలో సందేహమేం లేదు.