Begin typing your search above and press return to search.

గ్యారేజ్ డిలే.. కొరటాల వివరణ కేక

By:  Tupaki Desk   |   15 July 2016 9:01 AM GMT
గ్యారేజ్ డిలే.. కొరటాల వివరణ కేక
X
డేట్ కంటే కంటెంటే ఇంపార్టెంట్.. ఇదీ జనతా గ్యారేజ్ విడుదల ఆలస్యంపై దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన అల్టిమేట్ స్టేట్మెంట్. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ విడుదలను ఆగస్ట్ 12 నుంచి సెప్టెంబర్ 2కు రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ న్యూస్ అయిపోయింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడమే కాదు.. తామే స్వయంగా కూచుని సుదీర్ఘ వివరణ ఇవ్వడం విశేషం.

"వర్షాల వల్ల అనుకున్న డేట్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఇంకా పది రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ పెద్ద కాస్టింగ్ కారణంగా అందరూ వెంటనే ఎడ్జస్ట్ చేయలేకపోయారు. మరీ డేట్ కోసం టైట్ గా వెళ్తే పోస్ట్ ప్రొడక్షన్ కి టైమ్ లేకుండా పోతోంది. తిరు - దేవిశ్రీ లాంటి పెద్ద టెక్నీషియన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైమ్ ఇవ్వకపోవడం తప్పనిపించింది. ఆగస్ట్ 12 కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అయినా కానీ ఒకవేళ అప్పటికి రెడీ కాకపోతే.. అప్పుటికప్పుడు లాస్ట్ మినిట్ అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు' కాదు ఆలస్యంపై డీటైల్డ్ గా చెప్పిన కొరటాల.. సినిమా కంటెంట్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

"సినిమా చాలా మంచి షేప్ తీసుకుంది. లేట్ అయినా బెస్ట్ కంటెంట్ తో వస్తున్నాం. ఎన్టీఆర్ ని చాలా కొత్తగా చూస్తారు. అంత పెద్ద స్టార్ కాబట్టి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారని తెలుసు. అయినా సరే డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి సారీ చెబుతున్నా. నెక్ట్స్ వీక్ ఆడియో గురించి అనౌన్స్ చేస్తాం. వచ్చే నెల మొదటి వారంలో ఉండచ్చు. తెలుగు మలయాళం రెండు భాషలు తీస్తున్న సినిమా కాబట్టి గ్యారంటీగా పోస్ట్ ప్రొడక్షన్ కి టైమ్ కావాలి. రిలీజ్ అయ్యాక ఇంకా బాగా చేయాల్సింది అనుకునే బదులు ఇప్పుడే వాయిదా వేసుకోవడమే కరెక్ట్" అంటూ విడుదల ఆలస్యంపై ఇప్పటివరకూ ఎవరూ చెప్పనంత చక్కగా చెప్పి ఆకట్టుకున్నాడు కొరటాల శివ.