Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ ఫ్యామిలీ కష్టపడిందిట
By: Tupaki Desk | 16 April 2018 11:13 AM ISTటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను మూవీతో ముఖ్యమంత్రి క్యారెక్టర్ లో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ప్రతి సినిమాకు ఓ కొత్త సోషల్ మెసేజ్ ఇస్తూ వస్తున్న కొరటాల శివ భరత్ అనే నేను సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి చేసేదాకా చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చాడట.
ఈ రీసెర్స్ లో తనకు సపోర్ట్ గా నిలిచింది ఎవరనే సీక్రెట్ కొరటాల శివ రీసెంట్ గా బయటపెట్టాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయం రివీల్ చేశాడు. తాను స్క్రిప్టు రెడీ చేశాక దాన్ని మొత్తం చదివి అందులో లోపాలు ఎత్తి చూపేది తన భార్యేనని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. భార్యతోపాటు గవర్నమెంట్ ఉద్యోగి అయిన తన బావ మరిదితో కూడా స్క్రిప్ట్ లో మంచి చెడులపై డిస్కస్ చేస్తుంటానన్నాడు. ‘‘వాళ్లిద్దరూ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఎంతో ఇంపార్టెంట్. భరత్ అనే నేను సినిమా కోసం నాతోపాటు వాళ్లూ ఎంతో రీసెర్చ్ చేశారు. తాజా సమాచారం సేకరించడం దగ్గర నుంచి సబ్జెక్ట్ ఎక్స్ పర్టులతో మాట్లాడటం.. ప్రభుత్వ అధికారులు - రాజకీయ నాయకులతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడం వంటివన్నీ భార్య - బావమరుదులే చేశారని’’ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
భరత్ అనే నేను మూవీలో నటించడానికి ఓకే చెప్పినప్పటి నుంచి మహేష్ కూడా న్యూస్ ఫాలో చూడటం.. అసెంబ్లీ సెషన్స్ ఫాలో కావడంతోపాటు పొలిటీషియన్స్ పై స్సెషల్ గా స్టడీ చేశాడట. అందుకే ఈ మూవీలో సీఎం క్యారెక్టర్ లో అదరగొట్టేశాడనేది కొరటాల మాట. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.