Begin typing your search above and press return to search.

శ్రీమంతుడిలో వీటిని గమనించారా?

By:  Tupaki Desk   |   16 Aug 2015 3:50 AM GMT
శ్రీమంతుడిలో వీటిని గమనించారా?
X
కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన శ్రీమంతుడు ఘన విజయం సాధించడంతో చిత్ర బృందమంతా విజాయనందంలో మునిగితేలుతుంది. అయితే ఈ ఫలితం వెనుక ఎంతో కష్టముంది. ఈ ప్రయత్నం వెనుక ఎంతో కృషి దాగుంది. హీరో పల్లెటూరి వాడని కన్వేయ్ చెయ్యడానికి మొదట్నుంచీ అతనికి ఆ యాస పెట్టడం దగ్గరనుండీ దర్శకుడు ఎంతో కేర్ తీసుకున్నాడు. అలా ఈ శ్రీమంతుడి సినిమాలో మనం గమనించని కొన్ని చిన్న చిన్న విషయాలను స్మురిద్ధామా?

* ఈ సినిమా మొదటి పాత 'రాములోడొచ్చినాడు రో' శ్రీరామ నవమికి వేసిన పందిరిలో షూట్ చేశారు. అయితే ఈ పాట సాహిత్యమంతా జనాన్ని మనం అనుకుని బ్రతకడమే నిజమైన జీవితమని వుంటుంది. దీనికి అనుగుణంగా అక్కినేని వంశం 'మనం' సినిమా పోస్టర్ ని పాటలో ఒకచోట కనబడేలా ఏర్పాటు చెయ్యడం విశేషం.

* కొడుకు పోయిన దుఖంలో వేరే వూరికి వెళ్లిపోతుంటే రాజేంద్రప్రసాద్ ఆపడానికి వెళ్తాడు. అక్కడ బస్ గమ్యస్థానం 'కొత్త వలస' అని బోర్డు వుంటుంది. నిజానికి కొత్తవలస శ్రీకాకుళం దగ్గర వూరు. కానీ దేవరకోట ప్రజలు కొత్తగా వలస వెళ్ళిపోతున్నారు అన్న పరమార్ధాన్ని ఒక్క బోర్డుతో చూపించాడు దర్శకుడు.

* మహేష్ తన సొంత వూరికి ప్రయాణమయ్యే సమయంలో విలన్ మహేష్ వెళ్తున్న బస్ ఆపుతాడని, అందులోనుండి మహేష్ ని దింపుతాడని అనుకుంటాం కానీ అక్కడ వేరేవాళ్ళు వుండి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అయితే జాగ్రత్తగా గమనిస్తే మహేష్ హైదరాబాద్ నుండి బయల్దెరతాడు కాబట్టి మహేష్ టి.ఎస్.ఆర్.టి.సి బస్సుని, విలన్ ఆపే బస్సు ఊరి నుండి హైదరాబాద్ కి వస్తుంది గాబట్టి దానిమీద ఏ.పి.ఎస్.ఆర్.టి.సి లోగోని నిలిపి దర్శకుడు లాజిక్ ని వదిలిపెట్టలేదు.

ఇంత చిన్న చిన్న విషయాలలో కూడా తగిన జాగ్రత్త తీసుకున్నారు గనుకే శ్రీమంతుడు అంత మంచి విజయాన్ని సాధించింది మరి..