Begin typing your search above and press return to search.
'ఆచార్యలో మహేష్' వార్తలపై క్లారిటీ ఇచ్చిన కొరటాల..!
By: Tupaki Desk | 17 April 2020 11:30 PM GMTతెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. కొరటాల సినిమా అంటే కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కూడా ఉంటుందని సినీ అభిమానులు భావిస్తుంటారు. సినిమా ద్వారా కచ్చితంగా ఏదో ఒక మంచి చెప్పాలనే ఉద్ధేశ్యం కూడా ఈయన సినిమాల్లో కనిపిస్తుంటుంది. సామాజిక నేపథ్యంలో చిత్రాలని చేస్తూ మంచి విజయాలని అంది పుచ్చుకుంటున్న కొరటాల శివ.. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోకి సరిసమానమైన మరో పాత్ర ఉండబోతోందని మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ సినిమాలో ఆ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడని.. అయితే 'ఆర్ ఆర్ ఆర్'తో చెర్రీ బిజీగా ఉండడంతో అతని స్థానంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చరణ్ ఆ పాత్ర చేయబోతున్నాడని క్లారిటీ ఇచ్చాడు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆ వార్తల గురించి దర్శకుడు కొరటాల శివ స్పందించారట. 'ఆచార్య'లో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకోవాలనుకున్నాం. అయితే 'ఆర్ ఆర్ ఆర్' షెడ్యూల్ వల్ల చెర్రీ అందుబాటులో ఉండేది అనుమానంగా మారడంతో టెన్షన్ మొదలైంది. అప్పుడే మహేష్ తో మాట్లాడాను. 'మరీ అవసరమైతే నేను ఉన్నాను' అని అన్నారు. మహేష్ ఆ మాట అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.. సినిమాలో పాత్ర గురించి కూడా తెలియకుండా 'నేనున్నా' అని మహేష్ చెప్పారు.. 'ఆయనది గొప్ప మనసు' అని కొరటాల చెప్పారట. అయితే అంత పెద్ద స్టార్ హీరో అలా అనేసరికి ఈ విషయాన్ని కొందరితో షేర్ చేసుకోగా.. అది కాస్తా మహేష్ బాబు 'ఆచార్య'లో నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగిందని కొరటాల చెప్పుకొచ్చారట. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ తో ఇంకో సినిమా చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.