Begin typing your search above and press return to search.
ఆహాతో యూత్ కు మెసేజ్ ఇవ్వబోతున్న కొరటాల
By: Tupaki Desk | 26 July 2020 3:30 PM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను చిత్రం తర్వాత ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయాడు. ఆ చిత్రం విడుదలైన వెంటనే చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడంతో మరే ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అన్నట్లుగా కొరటాల పరిస్థితి అయ్యింది. తీరా చిరుతో ఆచార్య మొదలు పెట్టిన కొరటాలకు కరోనా కారణంగా మరో షాక్ తగిలింది.
సినిమాలు లేని ఈ సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్న సినిమాలకు స్క్రిప్ట్ సజేషన్స్ ఇస్తూ భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కొరటాల శివ ఒక వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. ఆహా ఓటీటీ కోసం తన శిష్యుడు కిరణ్ తో టీనేజ్ లవ్ స్టోరీతో వెబ్ సిరీస్ ను చేయిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రిప్ట్ కూడా తానే అందించాడట. టీనేజ్ లవ్ వల్ల కలిగే నష్టం ఏంటీ అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నారట.
కొత్త నటీనటులతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కొరటాల దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోంది. తన సినిమాలతో ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే వస్తున్న కొరటాల శివ ఈసారి టీనేజ్ లవ్ వల్ల జీవితంలో నష్టపోయేది ఏంటీ అనేది కాస్త బోల్డ్ పద్దతిలో చూపించబోతున్నాడట. కాస్త ఘాటుగానే ఇందులో యూత్ కు సందేశంను కొరటాల ఇవ్వనున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కొన్ని వారాల్లో షూటింగ్ ను పూర్తి చేసి ఆహాలో స్ట్రీమింగ్ ను మొదలు పెట్టే అవకాశముందట. మరో వైపు కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గితే సెప్టెంబర్ నుండి ఆచార్య షూటింగ్ ను ప్రారంభించాలంటూ ఎదురు చూస్తున్నాడు.