Begin typing your search above and press return to search.

కొరటాల లేదు లేదంటూనే..

By:  Tupaki Desk   |   6 Aug 2015 11:49 AM GMT
కొరటాల లేదు లేదంటూనే..
X
తాను రాసే కథ ఏ దర్శకుడికైనా గొప్పగానే అనిపిస్తుంది. అతడికి చాలా ఎగ్జైట్మెంట్ కూడా కలిగిస్తుంది. కానీ అది మిగతా యూనిట్ సభ్యులకూ అదే ఫీలింగ్ కలిగించడం ముఖ్యం. ఆ తర్వాత ప్రేక్షకులకూ అలాంటి అనుభూతినే కలిగిస్తే ఆ సినిమా సూపర్ హిట్టవుతుంది. ‘శ్రీమంతుడు’ అలాంటి కథే అంటున్నాడు కొరటాల. తాను రాసిన కథను 80 శాతం తెరపైకి తేగలిగినా గొప్పే అనుకున్నానని.. కానీ ఔట్ పుట్ వంద శాతం దాటిపోయిందని అంటున్నాడు కొరటాల. తన సినిమా గురించి తాను ఎక్కువ చెప్పుకోకూడదంటూనే ‘శ్రీమంతుడు’ గురించి చాలా చెప్పాడు కొరటాల. ఆ విశేషాలేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందా పదండి.

‘‘నా కథ కాబట్టి నేను ఎగ్జయిలవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ నా లీడ్‌ యాక్టర్‌, నా ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ అందరూ ఎగ్జయిటైతేనే సినిమా బాగా తీయగలుగుతానని నమ్ముతాను. శ్రీమంతుడు కథ విన్నప్పుడు మహేష్ చాలా మంచి మాటలు చెప్పారు. బాగా ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్, ఉత్సాహం సినిమా పూర్తయి డబ్బింగ్ చెప్పే వరకు అలాగే ఉంది. శ్రీమంతుడు లాంటి కథ రాసి అనుకున్నట్లు సినిమా తీసినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. నా టీంలో అందరినీ ఓపెన్‌ గా అడిగాను.. ఎలా వుందని. వాళ్లు చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఇచ్చారుు. విడుదలకు ముందు నేనా మాటలు చెబితే టూమచ్ గా అనిపిస్తుంది. ఈ దశలో నేను చాలా తక్కువ మాట్లాడాలి. నా సినిమానే ఎక్కువ మాట్లాడుతుందని నా నమ్మకం. పేపర్‌ మీద రాసినప్పుడు స్క్రిప్టు బాగుందనిపిస్తుంది. తెరమీదకి వచ్చేటప్పటికీ అందులో 80 శాతం వచ్చినా చాలనుకుంటాం. కానీ ఈ సినిమాకి వంద శాతం కంటే ఎక్కువ ఔట్ పుట్ వచ్చింది. అందుకే రిలీజ్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో చూద్దామనుకుంటున్నా’’ అని కొరటాల చెప్పాడు. ఆయన ఎదురు చూపులకు ఇంకొన్ని గంటల్లో తెరపడబోతోంది.