Begin typing your search above and press return to search.
రేట్లన్నీ కొరటాల చెప్పినట్లే...
By: Tupaki Desk | 7 March 2018 9:53 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య వరస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. వరసగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వస్తున్నా నటుడిగా పేరొస్తోంది కానీ నిర్మాతలకు డబ్బులు రావడం లేదు. ఇన్నీ ఎదురుదెబ్బల తరవాత కూడా అతడి లేటెస్ట్ సినిమా భరత్ అనే నేనుపై అభిమానుల్లోనూ.. బయ్యర్లలోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకు కారణం ఈమూవీలో మహేష్ తొలిసారి ముఖ్యమంత్రిగా కనిపించబోవడం... ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ కావడం.
ఈమధ్య కాలంలో మహేష్ సినిమాలు కమర్షియల్ గా పెట్టుబడిని తిరిగి రాబట్టుకోలేక పోయాయి. ఈ విషయం ఎత్తి బయ్యర్లు ఎవరైనా భరత్ అనే నేను ధర తగ్గించుకోమని అడిగితే అందుకు కొరటాల శివ కుదరదని తెగేసి చెబుతున్నాడట. ఒరిజినల్ గా బిజినెస్ ఎంతవుతుంది.. ఎక్కడ సెట్ చేయాలి అన్నది నిర్మాతల పని అయినా ఈ మూవీ వరకు కొరటాల చెప్పిన రేట్ ఫైనల్ చేసుకోవాల్సి వస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
సినిమా బిజినెస్ పై కొరటాలకున్న ఇంట్రస్ట్ ఏమిటని కొందరు ఆరా తీస్తే ఈ మూవీ మేకింగ్ కోసం అతడు డబ్బులు ఏమీ తీసుకోలేదట. దానికి బదులుగా రిలీజైన తరవాత లాభాల్లో షేర్ మాత్రం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకే బిజినెస్ విషయంలో తనే స్వయంగా జోక్యం చేసుకుని మంచి రేటు వచ్చేలా మానేజ్ చేస్తున్నాడట. ఇదేదో కలిసొస్తోంది కదా అని నిర్మాతలు కూడా అతడు చెప్పిన మాటకే ఓకే అంటున్నారట.