Begin typing your search above and press return to search.
'నోటా' లో కొరటాల ఇన్వాల్వ్ మెంట్ ఏంటీ?
By: Tupaki Desk | 9 Oct 2018 11:34 AM GMTవిజయ్ దేవరకొండ తాజా ద్విభాష చిత్రం ‘నోటా’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. విజయ్ గత చిత్రాలు సూపర్ హిట్ అయిన కారణంగా ఈ చిత్రంకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. భారీ ఎత్తున ఈ చిత్రం విజయాన్ని అందుకుంటుందని అంతా ఆశించారు. కాని అందరి అంచనాలను తారు మారు చేస్తూ ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంకు తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. అయితే తాజాగా సినీ వర్గాల్లో కొరటాల శివ ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యాడంటూ ప్రచారం జరుగుతుంది.
‘నోటా’ ప్రీ రిలీజ్ వేడుకలో కొరటాల శివ ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ అతడి ఇమేజ్ కు తగ్గట్లుగా తాను ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నట్లుగా ప్రకటించాడు. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పిన కొరటాల శివ ‘నోటా’కు కూడా స్క్రిప్ట్ వర్క్ లో హెల్ప్ చేసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘నోటా’ చిత్రం స్క్రిప్ట్ ను కొరటాల వద్దకు విజయ్ దేవరకొండ తీసుకు వెళ్లాడని, ఆయన సూచించిన మార్పులు చేర్పులు చేయించాడని తెలుస్తోంది.
‘భరత్ అనే నేను’ చిత్రంతో భ్లాక్ బస్టర్ సక్సెస్ ను కొరటాల దక్కించుకున్న కారణంగా దర్శకుడు ఆనంద్ శంకర్ కూడా ‘నోటా’ స్క్రిప్ట్ లో కొరటాల ఇన్వాల్వ్‌మెంట్ కు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. కొరటాల శివ సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసిన కారణంగా సినిమా ఈమాత్రం అయిన ఆడినది అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ‘నోటా’ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కొరటాల ఇన్వాల్వ్ మెంట్ వార్తలను కొట్టిపారేస్తున్నారు.