Begin typing your search above and press return to search.
స్క్రిప్ట్ లో మార్పులు చేయడం కుదరదంటున్న స్టార్ డైరెక్టర్...?
By: Tupaki Desk | 26 Aug 2020 5:34 PM GMTటాలీవుడ్ హీరోలందరూ తమ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ అక్కడ కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ అనౌన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకోవాలని ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న బన్నీ.. కొరటాల దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. అల్లు అర్జున్ కెరీర్లో 21వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి కొరటాల శివ ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ - స్వాతి - నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు బన్నీ - కొరటాల కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
కాగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నాం కాబట్టి ఈ చిత్రాన్ని 'సాహో' తరహా హిందీ చిత్రంలా తీయమని హీరో అల్లు అర్జున్ - ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దర్శకుడికి సూచించారట. అయితే అది కుదరదని.. ఎందుకంటే ఈ చిత్ర కథ ప్రకారం మన నేటివిటీకి చెందిన సున్నితమైన అంశాలు కలిగినదని.. అందువల్ల మార్చడం కుదరని చెప్పేశారట. ఇతర భాషల్లో రిలీజ్ చేసే సినిమా కాబట్టి దానికి తగ్గట్టు నటీనటులను తీసుకుందామని కొరటాల చెప్పాడట. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి కథ కథనాలు పూర్తిగా తనకే ఒదిలేయాలని ఈ స్టార్ డైరెక్టర్ చెప్పినట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా బన్నీ 'పుష్ప' కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మరోవైపు కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ''ఆచార్య'' సినిమా పూర్తి చేసి.. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టనున్నాడు.