Begin typing your search above and press return to search.
కొరటాలకు మహేష్ సినిమా నేర్పిన పాఠం!
By: Tupaki Desk | 7 Sep 2016 6:10 AM GMTనేర్చుకోవాలే కానీ.. ప్రతీ వ్యక్తి చనిపోయేవారకూ నేర్చుకోవచ్చు.. గొప్పవ్యక్తి ఎప్పుడూ నిత్య విద్యార్థే. అయితే కొంతమంది కొన్ని విషయాలు తమ స్వానుభవంతో నేర్చుకుంటె.. మరి కొందరు మాత్రం ఎదుటివారి అనుభవాలనుంచి కూడా చాలా విషయాలు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. ఈ విషయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల హ్యాట్రిక్ ఆనందంలో తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ తాను నేర్చుకున్న - నేర్చుకుంటున్న పాఠాల అనుభవాలను షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే తాను రచయితగా ఉన్నప్పటి అనుభవాలను - కష్టాలను వివరించిన కొరటాల శివ.. డైరెక్టర్ అయిన తర్వాత తెలుసుకున్న - నేర్చుకున్న ఒక కొత్త విషయాన్ని చెప్పాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ "1 నేనొక్కడినే" సినిమా నుంచి సుకుమారో - మహేషో ఏమి పాఠం నేర్చుకున్నారో కానీ.. కొరటాల మాత్రం మంచి పాఠమే నేర్చుకున్నారట. ఈ విషయంపై స్పందించిన కొరటాల... "1 నేనొక్కడినే" తన నా దృష్టిలో చాలా మంచి సినిమా అని, కానీ ఆడకుండా పోయిందని.. మన అభిరుచులను ప్రజలపైన రుద్దొద్దనే విషయం - సందేశాలు ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదనే సంగతి ఆ సినిమా చూశాక నేర్చుకున్నానని చెప్పాడు. ఇది సినిమాల్లోనే కాదు నా అసిస్టెంట్ల విషయంలో కూడా పాటిస్తుంటాను.. వారికి కూడా ఎలాంటి మెసేజ్ లు ఇవ్వనని స్పష్టం చేశాడు.
ఇక తన కెరీర్ పై మాట్లాడిన కొరటాల... ఇప్పటివరకూ చేసిన మూడు సినిమాలతో రావాల్సిన దాని కన్నా ఎక్కువ పేరే వచ్చిందని - దర్శకుడిగా తన ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతోందని అన్నాడు. తన కెరీర్ మొత్తంలో పది బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలన్నది తన లక్ష్యమని - అందుకే రిలాక్స్ గా సినిమాలు తీస్తున్నానని కొరటాల చెప్పాడు. తాను రైటర్ గా పనిచేసినప్పుడు ఏమీ సంపాదించలేకపోయినా.. ఆ ఐదేళ్లు తనకు పెట్టుబడి అని - రచయితగా నాటి అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడుతోందని.. ఎవరి సాయం లేకుండా కూర్చుని కథ రాసుకోగలుగుతున్నానని అన్నాడు కొరటాల శివ!