Begin typing your search above and press return to search.

మహేష్ కోసం దేవిశ్రీ కొట్టేశాడు బాస్..

By:  Tupaki Desk   |   16 March 2017 4:32 AM GMT
మహేష్ కోసం దేవిశ్రీ కొట్టేశాడు బాస్..
X
తన సినిమాల షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేయడం కొరటాల శివకు అలవాటు. ‘శ్రీమంతుడు’.. ‘జనతా గ్యారేజ్’ సినిమాలకు ఇలాగే చేశాడు. ‘జనతా గ్యారేజ్’ రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే దేవిశ్రీతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనడం.. పాటల పని పూర్తి చేయడం.. దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం గుర్తుండే ఉంటుంది.

ఐతే ఇప్పుడు మహేష్ సినిమా కోసం మరింత అడ్వాన్స్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ కానిచ్చేశాడు కొరటాల. ఈ సినిమా ఇంకా ప్రారంభోత్సవం కూడా జరుపుకోలేదు. అప్పుడే కొరటాల-దేవి కలిసి సంగీత చర్చలు పూర్తి చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్న రవి.కె.చంద్రన్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనడం విశేషం. ట్యూన్స్ అన్నీ అప్పుడే ఓ కొలిక్కి వచ్చేశాయట. ఇక దేవి చెన్నైకి వెళ్లి గాయనీగాయకులతో పాటలు పాడించడమే తరువాయి.

ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఈ సినిమా టైటిల్ ‘భరత్ అను నేను’ అని కూడా కన్ఫమ్ చేశాడు దేవిశ్రీ. ఈ టైటిల్ ఈ సినిమాకు ఖాయం అని తెలిసినా ఇప్పటిదాకా చిత్ర యూనిట్ సభ్యులెవరూ అధికారికంగా చెప్పింది లేదు. ఐతే దేవి ‘భరత్ అను నేను’ అనే హ్యాష్ ట్యాగ్ జోడించడం ద్వారా ఈ చిత్ర టైటిల్ ఇదేనని కన్ఫమ్ చేశాడు. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రం ఏప్రిల్లో సెట్స్ మీదికి వెళ్తుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/