Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు తర్వాత ఏంటో ఆలోచించలేదు
By: Tupaki Desk | 5 Aug 2015 5:44 AM GMTమిర్చి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని శ్రీమంతుడు చిత్రం తెరకెక్కించాడు కొరటాల. మిర్చి కి, శ్రీమంతుడికి మధ్య బోలెడంత మెలోడ్రామా. కొరటాల కెరీర్ ఎటెళ్తోంది? అన్న సందిగ్ధం. ఎట్టకేలకు అన్నిటినీ అధిగమించి ధీరుడినని నిరూపించుకున్నాడు కొరటాల. శ్రీమంతుడు ఈనెల 7న రిలీజైపోతోంది కాబట్టి తర్వాతి సినిమా ఏంటి అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది.
దీనికి మీ సమాధానం ఏంటి అని కొరటాలను అడిగితే.. ఇప్పటి కైతే ఏమీ ఆలోచించలేదు. నేను రచయితను. నా బలం రాయడం. కాబట్టి ముందు ఓ మంచి ఫీల్ గుడ్ కథాంశంతో స్క్రిప్టు రాస్తాను. తర్వాత దానికి సూటయ్యే నటీనటుల్ని ఎంచుకుంటాను. అంతవరకూ హీరో ఎవరు? అనేది కూడా చెప్పలేను.. అని చెప్పాడు. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ ఊరిని దత్తత తీసుకుంటున్నాడు కదా! మీ సినిమానే ఇన్ స్పిరేషనా? అని ప్రశ్నిస్తే .. అలాంటిదేం లేదు. నా సినిమా సెట్స్ లో ఉండగానే మహేష్ బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాడు. ఇది యాధృచ్ఛికం మాత్రమే. కోఇన్సిడెన్స్ అనే అంటాను.. అని సమాధానమిచ్చారు.
మహేష్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది? అన్న ప్రశ్నకు .. అద్భుతం. ఓ స్క్రిప్టు విన్న తర్వాత పాత్రలోకి పరకాయం చేయడం ఎలానో మహేష్ ని చూసి తెలుసుకోవాలి. నవ్వే నవ్వు, ఆహార్యం, ఆంగికం, డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ ఇలా ప్రతి విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తాడు. పక్కాగా పాత్రలోకి ఒదిగిపోతాడు. అందుకే అతడు సూపర్ స్టార్ అయ్యాడని కితాబిచ్చాడు కొరటాల. అదీ సంగతి.