Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో హిట్ కొడితే బన్నీతో ఈజి

By:  Tupaki Desk   |   13 Oct 2022 11:30 PM GMT
ఎన్టీఆర్ తో హిట్ కొడితే బన్నీతో ఈజి
X
కొరటాల శివ కెరీర్ మొదట్లో రచయిత నుంచి దర్శకుడిగా మారడానికి ఎంతగా కష్టపడ్డాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అతను ఆచార్య కొట్టిన దెబ్బకు కోలుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే విధంగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో మొదలు కావలసిన ప్రాజెక్ట్ అయితే ఇంకా పట్టాలు ఎక్కలేదు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అసలు సినిమా మొదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇదివరకె జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా అన్ని ఓకే చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు కొరటాల శివ సినిమా కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ తప్పకుండా అయితే ఈ సినిమా మొదలు కావచ్చు అని కొరటాల శివ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ఈ సమయంలో కొరటాల శివకు మద్దతుగా ఎక్కువగా ఉన్నది మాత్రం అల్లు అర్జున్ అని టాక్. కొరటాల శివ బన్నీ మధ్యలో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు కానీ పరిచయం అయితే గట్టిగానే ఉంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్న కొరటాల పుష్ప సినిమా విడుదల కంటే ముందు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అదే కథను ఇప్పుడు అటు ఇటుగా మార్చి ఎన్టీఆర్ తో చేస్తున్నారని టాక్ కూడా ఉంది.

ఇక ఆ సంగతి పక్కన పెడితే మాత్రం ఇప్పుడు కొరటాల శివకు ఫుల్ సపోర్ట్ చేస్తున్న బన్నీ ఎలాగైనా ఎన్టీఆర్ తో సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే ప్రాజెక్టు కోసం ముందుగానే సెట్స్ నిర్మించుకునే విధంగా ఇల్లు స్టూడియోస్ ను అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు స్టూడియోస్ మొదలైన విషయం తెలిసిందే. ఇక అందులోనే సెట్స్ వర్క్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకు జరిగే విధంగా అన్ని అక్కడే చూసుకోవాలి అని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఒకవైపు బన్నీ అల్లు స్టూడియో స్థాయిని పెంచే విధంగా సపోర్ట్ చేస్తూనే.. మరొకవైపు కొరటాల శివకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే కొరటాల శివ ఎన్టీఆర్ తో సక్సెస్ అందుకుంటే ఆ తర్వాత బన్నీతో చాలా ఈజీగా టెన్షన్ లేకుండా మరో సినిమాను మొదలు పెట్టవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఆచార్య గాయాన్ని మర్చిపోయేలా సక్సెస్ అయితే అందుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.