Begin typing your search above and press return to search.
భరత్ అనే నేను.. కొరటాలదేనా?
By: Tupaki Desk | 7 March 2018 5:00 PM ISTటాలీవుడ్లో రచయితగా ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత దర్శకుడిగా మారి గొప్ప పేరు సంపాదించిన వాళ్లలో కొరటాల శివ ఒకడు. కొరటాల ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్లయ్యాయి. అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. రచయితగా అతడి బలం ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. తన సినిమా స్క్రిప్టుకు సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తాడు కొరటాల. కథ.. స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అతనే సమకూర్చుకుంటాడు. తొలి మూడు సినిమాల్లో అదే జరిగింది. ఐతే కొరటాల నుంచి వస్తున్న కొత్త సినిమా ‘భరత్ అను నేను’ విషయంలో మాత్రం రూటు మార్చాడని.. ఈ సినిమాకు కథ అతడిది కాదని ప్రచారం జరిగింది.
ఒక రచయిత నుంచి భారీ మొత్తానికి కొరటాల కథ కొన్నట్లుగా చెప్పుకున్నారు. ఐతే ‘భరత్ అనే నేను’ టీజర్ చూస్తే అలాంటి ఛాయలేమీ కనిపించలేదు. ఇందులో పూర్తిగా కొరటాల ముద్రే కనిపించింది. టైటిల్స్ లో ఎక్కడా కూడా కొత్త పేరు కనిపించలేదు. కథకుడికి క్రెడిట్ ఇవ్వలేదు. కథకుడికి టీజర్.. ట్రైలర్లలో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఊరుకున్నారా లేక ఈ కథ కొరటాలే రాశాడా అన్నదానిపై స్పష్టత లేదు. తర్వాత ట్రైలర్లో కానీ.. ప్రమోషన్ల సందర్భంగా కానీ.. లేదా సినిమా రిలీజయ్యాక కానీ ఈ విషయంపై స్పష్టత వస్తుందేమో చూడాలి. ఇక నిన్న రిలీజైన ‘భరత్ అనే నేను’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అన్న ఫీలింగ్ జనాల్లో వచ్చేసింది.